2030 నాటికి  500కోట్లకు  ఫేస్‌బుక్‌ వినియోగదారులట

Facebook Users To Cross 500 Crores By 2030

10:20 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Facebook Users To Cross 500 Crores By 2030

సోషల్ మీడియా రంగాన ప్రముఖ పాత్ర పోషిస్తున్న సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ వినియోగదారుల సంఖ్య 2030 నాటికి 500కోట్లకు చేరుతుందని ఆ కంపెనీ సీఈవో మార్క్‌జుకర్‌బర్గ్‌ ఆకాంక్షించారు . ఫేస్‌బుక్‌ నూతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం 150కోట్ల (1.5బిలియన్‌) మంది వినియోగదారులు ఫేస్‌బుక్‌ని వినియోగిస్తున్నారని, 2030 నాటికి వారి సంఖ్య బాగా పెరుగుతుందని విశ్లేషించారు. ప్రతి ఒక్కరినీ ఫేస్‌బుక్‌తో కనెక్ట్‌ చేయాలని.. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థలు, కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని ఆయన తమ కంపెనీ ఉద్యోగులకు సూచించారు. మొత్తానికి ఏ ఎక్కౌంట్ వున్నా లేకున్నా ఫేస్బుక్ ఎక్కౌంట్ కంపల్సరీ చేస్తారేమో ...

English summary

Facebook CEO Mark Zuckerberg says that he was thinking that Facebook Will Have 500 crores Users by the year 2030.Mark Zuckerberg says that Facebook currently has more than 1.5 billion monthly active users and they were connecting everyone and going to do it in partnership with governments and different companies all over the world