గ్రామాల్లో వైఫై సేవలకు ఫేస్ బుక్ నిర్ణయం 

Facebook Wifi Services In Villages

10:14 AM ON 20th January, 2016 By Mirchi Vilas

Facebook Wifi Services In Villages

భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన వైఫై సేవలను అందించేందుకు ఫేస్‌బుక్‌ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. దేశంలో 125 గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తో రూ. 10కోట్లతో ఒప్పందం చేసుకుంది. దీనిద్వారా వచ్చే మూడేళ్ల కాలంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి బ్యాండ్‌విడ్త్‌ను వినియోగించుకునే అవకాశం ఫేస్‌బుక్‌కు లభించింది. ఒప్పందంలో భాగంగా 2 ఎంబీపీఎస్‌ వేగంతో వైఫై హాట్‌ స్పాట్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌ తన భాగస్వామి క్వాడ్‌జెన్‌ సహాయంతో ఏర్పాటు చేస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా నేపాల్‌ సరిహద్దు గ్రామాల్లో ఎయిర్‌జల్దీ భాగస్వామ్యంతో ఫేస్‌బుక్‌ వైఫై సేవలను ప్రారంభిస్తుంది. 30వేల మంది ప్రజలున్న ప్రాంతంలో రోజువారీ 6వేల మంది వైఫై సేవలను ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

అయితే ఫ్రీ బేసిక్స్‌తో ఉచితంగా నెట్‌ బ్రౌజింగ్‌ అవకాశం కల్పించాలనుకున్న ఫేస్‌బుక్‌ వైఫై సేవలకు మాత్రం కొద్దిమొత్తం వసూలు చేయాలని నిర్ణయించింది. రోజువారీ, నెలవారీ పథకాల్లో భాగంగా.. రూ. 10తో 100 ఎంబీ డేటానుఒక్క రోజులో బ్రౌజ్‌చేయవచ్చు. రూ. 200 చెల్లిస్తే 20 జీబీ డేటాను 30 రోజుల వ్యవధిలో ఉపయోగించవచ్చు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ మొత్తంతో వేగవంతమైన ఇంటర్నెట్‌ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఫేస్‌బుక్‌ దేశీయ టెలికాం సంస్థలకు పోటీ అవుతుందనడంలో సందేహం లేదు.

English summary

Popular Social Networking Site Facebook is to bring wifi services for Villages in India.To provide this services facebook tie up with BSNL telecom