ఫేస్ బుక్ కొత్త బ్రౌజర్ వచ్చేసిందోచ్ .... 

Facebooks New Browser

11:43 AM ON 19th January, 2016 By Mirchi Vilas

Facebooks New Browser

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్‌ ఎప్పటికప్పుడు కొత్త హంగులు సమకూరుస్తోంది. కొత్త వాటిని ఆవిష్కరించి వినియోగదారులకు అందిస్తోంది. తాజాగా ఆ సంస్థ ఫేస్‌బుక్‌ యాప్‌ కోసం కొత్త బ్రౌజర్‌ని రూపొందించిందట. అంతేకాదు ఆ బ్రౌజర్ పనితీరుని పరీక్షిస్తోందట. ఇప్పుడు ఫేస్‌బుక్‌ యాప్‌లో లాగిన్‌ అయి ఉన్నప్పుడు అక్కడి నుంచే వేరే పేజీలు చూసుకోవడం కుదరని పని. అందుకే దాని నుంచి బయటకు వచ్చాక మాత్రమే ఇతర పేజీల్ని చూసుకునేందుకువీలవుతుంది. అయితే ఇప్పుడు సంస్థ పరీక్షిస్తున్న ఈ బ్రౌజర్‌ ద్వారా ఫేస్‌బుక్‌లో లాగిన్‌ అయి ఉన్నప్పుడే ఇతర పేజీలను కూడా చూసుకునే వెసులుబాటు కలుగుతుంది.

ఫేస్‌బుక్‌ ఐఓఎస్‌ యాప్‌ యూజర్లకు ఈ ప్రయోగాత్మక బ్రౌజర్‌ ఇంటర్ఫేస్‌ వాడుకలోకొచ్చింది. యాప్‌ పేజీ కింద భాగంలో ఓ కొత్త బార్‌ వచ్చి చేరింది. బ్యాక్‌, ఫార్వర్డ్‌ బటన్లు; మెనూ, హౌ పాపులర్‌ ఏ పోస్ట్‌ ఈజ్‌... తదితరాలతోపాటు మరి కొన్ని ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే ట్యాబ్‌లు తెరుచుకునే సౌలభ్యం మాత్రం ఆ బార్‌లో లేదు. భవిష్యత్తులో అదికూడా వచ్చే అవకాశం లేకపోలేదు.

English summary

Popular social networking site facebook launched a new browser. Presently that browser is in testing stage. In that browser there were soo many features