ఇండియాలో ఫేస్‌బుక్, వాట్సప్ టాప్..

Facebook,Whats App Top India

04:39 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Facebook,Whats App Top India

ఫోన్ లో వందల రకాల యాప్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వేటికవే ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. అయితే ఇండియాలో పాపులర్ యాప్ ఏవి.. అందరికీ వచ్చే అనుమానం ఇదే. అయితే మన దేశంలో టాప్ లో నిలుస్తున్న యాప్స్ ఫేస్ బుక్.. వాట్సాప్ అట. దేశంలోని కోట్ల మంది ఈ రెండు యాప్స్ నే వినియోగిస్తున్నారట. కోట్ల మంది యూజర్ల స్మార్ట్ ఫోన్లలో ఈ రెండు ప్రథమ స్థానాన్ని ఆక్రమించాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్.. ఇలా ఏ ప్లాట్‌ఫామ్ అయినా యూజర్లంతా వాడుతున్న యాప్స్ కూడా ఇవేనట. మిగతా వాటికంటే చాలామంది సోషల్ మీడియా యాప్‌లవైపే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఇక ట్రూ కాలర్, యూసీ బ్రౌజర్‌లు తర్వాత స్థానాలను దక్కించుకున్నాయి. వీటితో పాటు ఎంఎక్స్ ప్లేయర్, ఫ్లిప్‌కార్ట్, క్యాండీ క్రష్, యాప్ లాక్, నౌక్రి యాప్‌లు టాప్ యూజింగ్ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి.

English summary

According to one study found that facebook and whats app are the most used social networking sites in India