మహాభారతంలో పరీక్షితుడు గురించి మీకు తెలుసా!

Facts About Parikshit In Mahabharata

03:19 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Facts About Parikshit In Mahabharata

మహాభారత యుద్ధంలో పాండవ వంశస్థుడు, పరీక్షితు మహారాజు జనకుడు అభిమన్యుడు. అభిమన్యుడిని చిన్నవాడు అన్న కనికరం లేకుండా కౌరవులందరు చుట్టుముట్టి వధించడం తెల్సిందే. అభిమన్యుడు, ఉత్తరల కుమారుడైన పరీక్షితుమహారాజు, అర్జున- సుభద్రల మనుమడు.

1/9 Pages

అసలు ఆపేరేలా వచ్చిందంటే ...

ద్రోణాచార్యుని కుమారుడు, అశ్వథామ, తన తండ్రి మరణానికి ప్రతీకారంగా ఉత్తర కడుపులో ఉన్న శిశువుని మట్టుపెట్టటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు,ఉత్తర కడుపులోనున్న శిశువును రక్షించాడు. శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈతన్ని రక్షించాడు కాబట్టి ఈతడు విష్ణురథ అన్న పేరుతో కూడా పిలువబడ్డాడు. ఈయన, తల్లి కడుపులో ఉండగానే శ్రీ కృష్ణుడు చేత పరీక్షింపబడి, రక్షింపబడ్డాడు కనుక ఈయనకు పరీక్షితుడు అన్న నామకరణం చేశారు. ఉప పాండవులలో మిగిలిన ఒకే ఒక వారసుడు పరీక్షితుడు.

English summary

Parikshit was the Grand Son of Arjuna and Subadra and he was the son of Abhimanyu and Uttar. He was the a very great king. Here is the story about him and his legacy.