శ్రీకృష్ణ ద్వారక గురించి ఆసక్తికరమైన విషయాలు

Facts about Srikrishna Dwaraka

04:02 PM ON 25th May, 2016 By Mirchi Vilas

Facts about Srikrishna Dwaraka

సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారక గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. 192 కి.మీ పొడవు, 192 కి.మీ వెడల్పు 36864 చ.కి.మీ విస్తీర్ణంతో బారులు తీరిన వీధులతో కలిగిన ద్వారక ఇప్పుడు సముద్ర గర్భంలో ఉంది. రామాయణం నిజమే, మహాభారతం నిజమే. అలాగే ద్వాపర యుగం కూడా నిజమే. వేల ఏళ్ళనాటి మన సంసృతి, అద్భుతమైన మన నాగరికత అపూర్వమైన మన సైన్స్ కూడా నిజమే. దీనికి నిదర్శనం సముద్ర గర్భంలో కనిపిస్తున్న ఈ మహానగరమే. ఒక మాటలో చెప్పాలంటే "ద్వారక గోల్డెన్ సిటీ ఆప్ ఇండియా" అని చెప్పాలి. అలాంటి మహానగరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1/11 Pages

సముద్రగర్భంలో ద్వారక

గుజరాత్ సముద్రతీరంలో 1983వ దశకంలో జరిగిన పరిశోధనలో ఒక అపూర్వ ఘట్టం బయటపడింది. పశ్చిమాన గోమతి నది వెళ్లి అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్రగర్భంలో ఒక మహానగరం బయటపడింది. ఈ నగరం శ్రీకృష్ణుడి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదే విశ్వకర్మ చే నిర్మించబడిన ద్వారక.ఈ పరిశోధనలలో ఏవో చిన్నచిన్న ఆదారాలు దొరకలేదు. ఏకంగా మహానగరమే బయటపడింది. సముద్రం లోపల ముందుకు వెళ్ళే కొద్దీ అంతమెక్కడో తెలియనంత దూరం ఉంది ఈ అద్భుతమైన ద్వారక నిర్మాణం.

English summary

In this article, we have listed about interesting facts about Srikrishna Dwaraka. Srikrishna's most favourite place is Dwaraka.