విజయవాడ స్టేషన్ కి రైళ్లు బంద్ ఎందుకో తెలుసా?

Facts About Vijayawada Station

12:43 PM ON 17th September, 2016 By Mirchi Vilas

Facts About Vijayawada Station

ప్రస్తుతం ఎపి రాజధానికి అతి సమీపంలో విజయవాడ వుంది కదా. ఇక ఇక్కడి రైల్వే స్టేషన్ నిత్యం కొన్ని వందల మంది ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. దేశంలోని అనేక ప్రాంతాలకు విజయవాడ మీదుగానే రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. జంక్షన్ కావడంతో దాదాపు ఏపీ, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే చాలా రైళ్లు విజయవాడను దాటుకునే వెళుతుంటాయి. అయితే ప్రస్తుతం 8 రోజుల పాటు విశ్రాంతి తీసుకోనుంది. 150 కోట్ల వ్యయంతో రెండువేల మంది కార్మికులు పనిచేసి స్టేషన్ ని పూర్తిస్థాయిలో ఆధునీకరించనున్నారు. ఒక మహాయజ్ఞం లా చేపట్టే ఈ కార్యక్రమం పూర్తవ్వగానే విజయవాడ జంక్షన్ లో ఔటర్ లో పడిగాపులు ఉండవట. ప్లాట్ ఫామ్ ల మధ్య తేడాలూ ఉండవు. రైళ్లు రయ్య్ మని వస్తాయట. అయితే ప్రస్తుతం ఎంతో రద్దీగా ఉంటున్న ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు 8రోజుల పాటు బోసిపోనుంది. సెప్టెంబర్ 20 నుంచి 28 వరకూ ఈ రైల్వే స్టేషన్ లో రైలు కూతగానీ, ట్రైన్ వస్తున్నట్టు, వెళుతున్నట్టు అనౌన్స్ మెంట్ గానీ వినిపించదు. దీనంతటికీ కారణం విజయవాడలో జంక్షన్ లో నెలకొన్న సిగ్నలింగ్ సమస్యను మెరుగుపరిచేందుకు అధికారులు చేపట్టిన భారీ ప్రాజెక్టు.

1/6 Pages

ప్లాట్ ఫామ్ లను ఆధునీకరించనున్నారు

ఈ ప్రాజెక్టులో భాగంగా ప్లాట్ ఫామ్ లను ఆధునీకరించనున్నారు. దాదాపు 150 కోట్ల వ్యయంతో... 2వేల మంది కార్మికులు రాత్రిపగలూ శ్రమించి ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. దీనివల్ల భారీ సంఖ్యలో రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నారు. దారి మళ్లించి గమ్యస్థానాలకు పంపించనున్నారు. ఇంతకీ అసలు విషయమేమిటంటే విజయవాడ రైల్వే స్టేషన్ లో 10 ప్లాట్ ఫామ్ లున్నాయి. వాటిలో 8,9,10 ప్లాట్ ఫామ్ లపైకి ఒకవైపు నుంచి మాత్రమే రైళ్లు వచ్చి పోతాయి! 2 నుంచి 5 ప్లాట్ ఫామ్ లపైకి 24 బోగీలున్న ఎక్స్ ప్రెస్ లేవీ రాలేవు! ఎందుకంటే... అందుకు తగిన సిగ్నలింగ్ వ్యవస్థ లేదు!! ‘సిగ్నల్ ప్రాబ్లమ్ ’తో బెజవాడ జంక్షన్ ఎప్పుడు చూసినా జామ్ ! అతి త్వరలోనే ఈ కష్టాలు తీరిపోనున్నాయి.

English summary

Facts About Vijayawada Railway Station. Vijayawada Railway Station is the second busiest railway junction of Indian Railways, next to Mumbai Central.