ఫ్రీడం 251... వాస్తవాలు.. అనుమానాలు

Facts And Doubts About Freedom 251

03:02 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Facts And Doubts About  Freedom 251

ఫ్రీడం 251.. ప్రస్తుతం దేశంలో మొబైల్ రంగాన్ని ఒక కుదుపు కుదిపిన స్మార్ట్ ఫోన్. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్ లోకి అడుగుపెట్టిన ఈ ఫోన్ కేవలం రూ. 251 కే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ కంపెనీ ఈ ఫోన్‌ ను రూపొందించింది. గురువారం ఉదయం నుంచి ఆ కంపెనీ వెబ్‌సైట్‌లో ఫోన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఉదయం ఆరు గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ప్రకటించడంతో ప్రజలు దీని కోసం నిరీక్షించారు. అయితే తొమ్మిది గంటల తర్వాతగానీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాలేదు. అది కూడా కొద్దిసేపు మాత్రమే. ఫోన్ ధర రూ. 251 అని చెప్పినా.. షిప్పింగ్ చార్జి రూ. 40 తో కలిపి మొత్తం రూ. 291 చెల్లించాల్సి వస్తోంది. అయితే ఆ తర్వాత నిలిచిపోయింది. సెకనుకు ఆరు లక్షల హిట్స్ వస్తున్నాయని, అందువల్ల సర్వర్ పై ఒత్తిడి పెరిగిందని పేర్కొంటూ కంపెనీ రిజిస్ట్రేషన్లను ఆపేసింది. మరో 24 గంటల్లో సర్వీసును అప్ డేట్ చేస్తామని వెల్లడించింది.

ఇక అసలు రూ. 251కి స్మార్ట్ ఫోన్ ఇవ్వడం సాధ్యమేనా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కంపెనీ మీడియాకు విడుదల చేసిన శాంపిల్‌ యూనిట్‌ రివ్యూలో అనేక అనుమానాలు వెలుగుచూస్తున్నాయి. యాపిల్ ఐఫోన్‌ డిజైన్‌ను ఫ్రీడం 251లో పూర్తిగా కాపీచేసింది. దీంతో యాపిల్‌ నుంచి దీనికి కాపీరైట్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఫ్రీడం 251లో ఉన్న చాలావరకు బిల్ట్‌ ఇన్ యాప్స్.. ఐఫోన్‌ నుంచి నేరుగా కాపీ చేసినవి కావడం గమనార్హం. ఐఫోన్‌, ఐప్యాడ్, మ్యాక్‌ లలో కనిపించే సఫారీ వెబ్‌ బ్రౌజరే ఇందులోనూ కనిపిస్తున్నది. అంతేకాక వెబ్‌సైట్‌లో చూపించిన మోడల్‌ ఫొటోలకు, విడుదల చేసిన మొబైల్‌ఫోన్‌కు తేడాలు ఉన్నాయి. ఫ్రీడం 251 పూర్తిగా ఐఫోన్‌ను పోలినట్టు కనిపించడమే కాకుండా.. ఐఫోన్ హోమ్‌ బటన్ తరహాలోనే దీనికి కూడా హోమ్‌ బటన్ ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్రీడం 251 అని పెద్దగా రాసి ఉన్నా.. దీని అసలు బ్రాండ్ యాడ్‌కామ్‌ అని తెలుస్తున్నది. ఒరిజినల్ బ్రాండ్ పేరును చెరిపేసి.. ఫ్రీడం 251 అని రాసినట్టు కనిపిస్తున్నది. యాడ్‌కామ్‌ అనేది ఢిల్లీకి చెందిన ఐటీ దిగమతుల కంపెనీ. ఈ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు ఆన్ లైన్ లో సుమారు రూ. 4వేలకు లభిస్తున్నాయి. ఇక ఈ ఫోన్ కు బీఐఎస్ సర్టిఫికేషన్ ఉందా అనేది కూడా అనుమానమే. ఈ ఫ్రీడం 251 ఫోన్ యాడ్ కామ్ కు చెందిన ఐకాన్ 4 మోడల్ ను అచ్చంగా పోలి ఉంది. అందువల్ల దీనికే మార్పులు చేసి అందిస్తోందా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ మోడల్ ప్రస్తుతం ఆన్ లైన్ లో సుమారు రూ. 4 వేలకు లభిస్తోంది.

ఫ్రీడం 251లో స్వచ్ఛ భారత్, మహిళల భద్రత, యూట్యూబ్, వాట్సప్, ఫేస్‌బుక్ యాప్స్ ఉంటాయని రింగింగ్ బెల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నప్పటికీ.. ఈ మోడల్‌లో అలాంటి యాప్స్ ఏమీ లేవు. అయితే మీడియాకు అవగాహన కోసం విడుదల చేసిన ఈ మోడల్ శాంపిల్ మాత్రమేనని, వినియోగదారులకు అమ్మబోయే ఫ్రీడం 251 మొబైల్ ఫోన్లలో తాము పేర్కొన్న అన్ని ఫీచర్స్, యాప్స్ ఉంటాయని రింగింగ్ బేల్స్ ప్రతినిధి చెపుతున్నారు.

గూగుల్ ని మించిన హిట్స్ ...
అసలు రింగింగ్‌ బెల్స్‌ వెబ్‌సైట్‌ కొద్ది క్షణాల్లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వెబ్‌సైట్‌ మాత్రం బాగా హిట్‌ అయ్యింది. గురువారం ఉదయం రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన వెంటనే.. ఫ్రీడం 251 వెబ్‌సైట్‌కు సెకండ్‌కి ఆరు లక్షల హిట్స్‌ వచ్చాయి. అదే గూగుల్‌కు సెకండ్‌కి 40వేల హిట్లు వస్తాయి. అంటే గూగుల్‌తో పోలిస్తే.. ఫ్రీడమ్‌కు సెకండ్‌కు 15రెట్ల ఎక్కువ హిట్లు వచ్చాయని చెప్పవచ్చు.

.

English summary

Indian smartphone maker Ring Bells to launch a cheapest smartphone named "Freedom 251"for just Rupees 251 only.This would be the cheapest smartphone in India.This smartphone was going to be launched by Defence Minister of India Manohar Parrikar.This smartphone comes with the excellent features like Android Lollipop 5.1 OS ,1.3 GHz quad-core processor, 4-inch screen,8GB internal memory,32GB with a micro SD card,1,450 mAh battery,3.2 megapixel on the back and 0.3 megapixel the front cameras.The officials were launched this smartphone registrations through online but due to over flow of registrations they have stopped registrations for 24 hours.There were soo many Doubts about this smartphone