నకిలీ రూ.2000 నోట్లు.. ఎంతో తెలిస్తే గుండె గుభేల్!

Fake 2000 notes in Punjab

01:18 PM ON 2nd December, 2016 By Mirchi Vilas

Fake 2000 notes in Punjab

ఎన్ని నిబంధనలు పెట్టినా వాటినుంచి ఎలా తప్పించుకోవాలో అడ్డదారులు తొక్కే కొందరికి బాగా తెల్సు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో వాటి మార్పిడి, బ్యాంకులో డిపాజిట్ చేసుకుని తీసుకునేందుకు ఓ వైపు జనం ఇబ్బంది పడుతున్నారు. కొత్త రూ.2000 నోట్లు ఎక్కువ మందికి చేరక ముందే, మరోవైపు మోసగాళ్ళు ఇదే అదునుగా రెచ్చిపోతున్నారు. ఏకంగా వాటి నకిలీవి తయారు చేస్తున్నారు. పంజాబ్ కు చెందిన ముగ్గురు రూ.42 లక్షల కొత్త రూ.2000 నకిలీ నోట్లను ముద్రించారు. వాటిని 30 శాతం కమీషన్ తో రద్దైన రూ.500, రూ.1000 నోట్లకు మార్పిడి చేస్తున్నారు.

కొత్త రూ.2000 నోటు గురించి జనానికి అంతగా తెలియక ఈ నకిలీ నోట్లతో మోసపోతున్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న మొహాలి పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో సుమన్ నాగ్ పాల్ ఓ రియల్ ఎస్టేట్ డీలర్. కాగా అభినవ్ వర్మ, వికాష్ అతడి బంధువులు కావడం విశేషం. లక్షల్లో కొత్త రూ.2000 నకిలీ నోట్లతో పాటు ఎర్ర బుగ్గ ఉన్న ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

1/3 Pages

రూ.5 కోట్లు కొత్తకరెన్సీ బయట పడింది...
కాగా బెంగళూరులో గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో ఏకంగా రూ.6కోట్లు గుర్తించగా, అందులో సుమారు రూ.5 కోట్లు కొత్తకరెన్సీ నోట్లు బయటపడటం సంచలనం కల్గించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని బెంగళూరులో ఐటీ అధికారులు గురువారం బెంగళూరులోని ఇద్దరు సీనియర్ అధికారులు ఇళ్లల్లో జరిపిన సోదాల్లో రూ.5కోట్ల నగదు గుర్తించారు.

English summary

Fake 2000 notes in Punjab