షాకింగ్ న్యూస్: ఏటీఎంలలో నకిలీ 500 నోట్లు!

Fake 500 notes in ATM's

11:25 AM ON 29th November, 2016 By Mirchi Vilas

Fake 500 notes in ATM's

పెద్ద నోట్ల రద్దుతో నకిలీ నోట్ల బెడద తగ్గుతుందని భావించినా, కొంతమంది చేతివాటం కారణంగా ఏటీఎంలలో సైతం నకిలీ నోట్లు ప్రత్యక్షమవుతున్నాయి. అవును, బ్యాంకుల సాక్షిగా ఏటీఎంల ద్వారా 19 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను పంపిణీ చేశారని తాజాగా వెల్లడైంది. దీంతో దేశంలో సంచలనం రేకెత్తింది. నకిలీ కరెన్సీ నోట్లను నివారించాల్సిన బ్యాంకులే వాటిని చలామణీ చేసిన బాగోతం బ్యాంకు ఖాతాదారులను నివ్వెరపర్చింది. వివిధ బ్యాంకులు గడచిన మూడున్నరేళ్లలో దేశంలో వివిధ ముఖవిలువలున్న 19 లక్షల నకిలీనోట్లను పంపిణీ చేశాయని, ఈ నోట్లలో రూ.14.97 కోట్లను ఏటీఎంల ద్వారా పంపిణీ చేశారని సాక్షాత్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నివేదిక నిగ్గుతేల్చింది. ఈ నకిలీ నోట్ల మార్పిడిపై రిజర్వుబ్యాంకు ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం విశేషం.

1/4 Pages

47 కోట్లు చెలామణి...
నకిలీ నోట్లలో 5.42 లక్షల నోట్లు వందరూపాయల విలువగలవి రూ.54.21కోట్లని తేలింది. 8.56 లక్షల 500 రూపాయల విలువగల నోట్ల విలువ రూ.42.8 కోట్ల నకిలీ నోట్లను పంపిణీ చేశారు. 4.7 లక్షల వేయిరూపాయల నోట్ల విలువ రూ.47 కోట్లను బ్యాంకులే చలామణి చేశాయని నివేదికలో వెల్లడైంది.

English summary

Fake 500 notes in ATM's