లైఫ్ స్టైల్ యజమాని దగ్గర తెలివిగా కోటి రూపాయలు కాజేసిన దొంగబాబా(వీడియో)

Fake baba cheats 1 crore rupees from lifestyle owner

10:33 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Fake baba cheats 1 crore rupees from lifestyle owner

ఎన్నో మోసాలు బయటపడుతున్న దొంగబాబాల ఉచ్చులో పడి, మోసపోవడం షరా మామూలు అయింది. తాజాగా బంజారాహిల్స్ లో లైఫ్ స్టైల్ యజమాని మధుసూదన్ రెడ్డి ఇంటిలో ఇంద్ర సినిమా స్టైల్లో ఘరానా దోపిడీ సంచలనం సృష్టించింది. భక్తి ముసుగులో మధుసూదన్ రెడ్డిని బురిడీ బాబా బురిడీ కొట్టించిన వ్యవహారం పై వాస్తవాన్ని పోలీసులు బయటపెట్టారు. బురిడీ బాబా మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఉదయం 10:30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూజలు నిర్వహించాడు. అనంతరం కోటీ 30 లక్షల రూపాయల డబ్బు మూటను పూజలు నిర్వహించాలన్న నెపంతో మధుసూధన్ రెడ్డి కుమారుడు సందేశ్ రెడ్డితో కలిసి వివిధ దేవాలయాలకు తీసుకెళ్లాడు.

అప్పటికే పూజలు ముగియగానే బురిడీ బాబా ఇచ్చిన ప్రసాదం పని చేయడం మొదలైంది. ఇంతలో బంజారాహిల్స్ లో తాను బస చేసిన హోటల్ కు సందేశ్ రెడ్డిను తీసుకెళ్లాడు. అక్కడ సందేశ్ రెడ్డి కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో విశ్రాంతి తీసుకోవాలని మాయ మాటలు చెప్పాడు. సందేశ్ రెడ్డి అపస్మారక స్థితిలో ఉండగా.. అతని నుంచి కారు కీస్ దొంగిలించి, కారులో ఉన్న డబ్బు మూటతో ఉడాయించాడు. తరువాత కాసేపటికి సందేశ్ రెడ్డి తేరుకుని ఇంటికి వెళ్లి చూసేసరికి తల్లిదండ్రులు కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో వారిని ఆసుపత్రిలో చేర్పించిన సందేశ్ రెడ్డి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా మత్తుమందు ఇచ్చి, దోపిడీకి పాల్పడింది శివ అనే పాత నేరస్తుడని పోలీసులు గుర్తించారు. తిరుపతిలోనూ లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 63 లక్షలు కాజేశాడు. లక్షకు రెండు లక్షలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి మోసం చేయడం అతడి అలవాటని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Fake baba cheats 1 crore rupees from lifestyle owner