మరింత చౌకగా ఐఫోన్ 5ఎస్

Fall in iPhone 5s price

04:49 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Fall in iPhone 5s price

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ విజయంలో ఐఫోన్ దే కీలక పాత్ర. ఈ స్మార్ట్‌ఫోన్ లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయంటే అతిశయోక్తి కాదు. యాపిల్‌ సంస్థ రెండు సంవత్సరాల క్రితం ఐఫోన్‌ 5ఎస్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పటికీ ఈ ఫోన్ కు మంచి డిమాండే ఉంది. సార్మ్ ఫోన్ మార్కెట్ లో వాటా పెంచుకోవాలని భావిస్తున్న యాపిల్.. ఇప్పుడు ఆ ఫోన్‌ ధరని భారీగా తగ్గించింది. ముఖ్యంగా భారత్ లో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఐఫోన్ 5ఎస్ మోడల్ ధరను తగ్గించింది. ఇప్పుడు చాలా తక్కువ ధరకే ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇంతకు ముందు ఐఫోన్ 5ఎస్ ధర రూ.35వేల వరకు ఉండేది. ఇప్పుడు రూ.22,500లకే ఈ డివైస్ లభిస్తోంది. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్‌లు స్నాప్‌డీల్, అమెజాన్‌ ఈ ఫోన్ ను రూ.21,499కే అందిస్తున్నాయి. గత సెప్టెంబర్‌లో దీని ధర రూ.35వేలకు తగ్గగా, ఇప్పుడు మరింత చవకగా దీన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ ఇప్పటికే మార్కెట్ లోకి రావడం.. దానికి తోడు త్వరలోనే ఐఫోన్ 7ని మార్కెట్ లోకి తీసుకొచ్చే వ్యూహంలో భాగంగా యాపిల్ 5ఎస్ ధర తగ్గించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary

Apple company has reduced the iPhone 5s price in India, with prices now starting at Rs. 22,500 for the 16GB model.Apple iphone 5s 16GB is available on Flipkart at as low as Rs. 21,948 and Amazon India and Snapdeal are offering it at Rs. 21,499