ఆకాశానికి చిల్లు పడిందా(వీడియో)

Falling rain from sky hole

01:40 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Falling rain from sky hole

ఈ మధ్య సడన్ గా మబ్బులు కమ్మి వర్షం కురుస్తోంది... కానీ ఒకే స్థలంలో వర్షం కురవడం ఎప్పుడైనా చూసారా? అంటే చూసామని చెప్పేవాళ్ళూ కొందరు వుంటారు.. అయితే మేము అనేది ఆమడ దూరంలో కురిసే వర్షం కాదు.... మీ ముందు నిటారుగా... నింగికి చిల్లు పడినట్టు వర్షం పడటం ఎప్పుడైనా చూసారా? అని అడగితే దానికి సమాధానం ఇక్కడ వీడియో చూస్తే, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాదు ఈ వీడియో తెగ షేర్ చేస్తున్నారు. టోగో దేశంలోని, క్పలిం(Kpalime) అనే నగరంలో ఈ వింత చోటు చేసుకుందని..

నింగిలోని స్వర్గం నుండి దివికి నేరుగా వర్షం కురవడం వింతగా ఉందని ఈ వీడియో రికార్డు చేసి ఇంటర్నెట్లో పెట్టిన వారు పేర్కొన్నారు. కానీ ఇది ఫేక్ అని తేలిపోయింది. నింగి నుండి వాన కురవడం కాదు కదా.... అసలిది వర్షమే కాదు అని తేలిపోయింది. భూమిలోని ఓ నీటి పైపు విరిగిపోవడంతో ఆ నీళ్ళు కాస్త పైకి వెదజిమ్ముతున్నప్పుడు తీసిన వీడియోను కాస్త పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు తార్కాణంగా ఫోటో కూడా హల్ చల్ చేస్తోంది.

English summary

Falling rain from sky hole