గ్లామర్ రోల్స్ మాట వట్టిదేనంటున్న కలర్స్ స్వాతి

False Statements On Me : Colors Swathi

06:40 PM ON 6th November, 2015 By Mirchi Vilas

False Statements On Me : Colors Swathi

"ఇంతకుముందు నా పెళ్లి గురించి ఎలా రూమర్లు పుట్టించారో.. ఇప్పుడు గ్లామర్ రోల్స్ చెయ్యబోతున్నానంటూ వస్తున్న వార్తలు కూడా అలాంటి పుకారే . అసలు నాకు అలాంటి ఉద్దేశాలేమీ లేవు" అని కలర్స్ పాప స్వాతి చెప్పుకునే పరిస్థితి వచ్చింది . ఇంతకీ విషయం ఏమంటే , స్వాతి గ్లామర్ రోల్స్ కు రెడీ అట.. ఇకపై ఆమెను ఇంకో యాంగిల్లో చూడొచ్చట అంటూ రెండు మూడు రోజులుగా పెద్ద టాక్ అయి కూర్చోవడంతో వివరణ ఇచ్చుకోక తప్పలేదు . ఇన్నాళ్లూ అంత పద్ధతిగా కనిపించి.. ఇప్పుడు స్వాతికి ఇదేం పాడు బుద్ధి అని కొందరు , స్వాతి పనైపోయిందనడానికి ఇదో ఇండికేషన్ అంటూ మరికొందరు చెవులు కోరుకున్నారు . ఐతే ఎవరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ.. తనకైతే గ్లామరస్ గా - సెక్సీగా కనిపించే ఉద్దేశాలేమీ లేవని కలర్స్ పాప చెప్పేసింది . గ్లామర్ రోల్స్ కు రెడీ అని తాను ఎక్కడా అనలేదని , ఇలా కావాలనే ఎవరో పుకార్లు పుట్టించారని ఈ అమ్మడు చిలక పలుకులు పలుకుతోంది." గ్లామర్ మరీ ఎక్కువైతే అలాంటి రోల్స్ నాకు సూటవ్వవని నా ఉద్దేశం. అలా నటించడానికి కూడా నేను ఇబ్బంది పడతాను. ఎవరు ఎలాంటి పాత్రలకు సూటవుతారో అలాంటి పాత్రలే చేయనివ్వండి. వాళ్లను ప్రోత్సహించండి. ఏదో ఒక ముద్ర వేసేసి ఇబ్బంది పెట్టకండి. నేను ఇలాంటి పాత్రలే చేయాలి అని ఫిక్సయిపోయి ఎప్పుడూ లేను. నా దగ్గరికి ఏ పాత్రలు వస్తే అవి చేశా’’ అని స్వాతి తెగేసి చెబుతోంది .

"నాకు స్టార్ హీరోయిన్ అయిపోవాలని బోలెడంత డబ్బులు సంపాదించేయాలని లేదు. నా మనసుకు నచ్చిన పాత్రలే చేశా.మలయాళంలో నేను తీసుకునే పారితోషకం చాలా తక్కువ. ఖర్చులకే సరిపోతుంది. అయినప్పటికీ అక్కడ సినిమాలు ఒప్పుకుంటున్నానంటే నా ప్రయారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. గ్యాప్ దొరికినపుడు ఆ టైంని తల్లిదండ్రుల కోసం సన్నిహితుల కోసం ఉపయోగిస్తా. అంతే తప్ప ఖాళీ అయిపోయానని బాధపడను"అని స్వాతి చెప్పుకొచ్చింది.

English summary

Tv anchor turned actress Colors Swathi Says She is not ready to do glamour roles. The Romours Coming that she is ready for such roles  are absolutely false.