జాతీయగీతంపై సినిమా హల్లో రచ్చ

Family had get out for Disrespecting National Anthem

12:26 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Family had get out for Disrespecting National Anthem

జాతీయగీతం పట్ల దేశంలో ఉన్న ఒక అత్యున్నత గౌరవానికి ప్రతీకగా ముంబాయిలోని ఒక సినిమా ధియేటర్‌లో జరిగిన ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. ముంబాయిలోని పివిఆర్‌ మల్టీప్లెక్స్‌ కాంప్లెక్స్‌లో జాతీయగీతానికి ధియేటర్‌లో ప్రేక్షకులంతా నిలబడి ఉండగా ఒక కుటుంబం మాత్రం ఏమాత్రం నిలబడకుండా సీట్లలోనే తాపీగా కూర్చుని ఉండడం చాలామందికి కోపం తెప్పించిందట. దీనితో వారిని ధియేటర్‌ నుండి బయటకు పంపేవరకూ గొడవ కొనసాగిందట.

ధియేటర్‌ నుండి సదరు కుటుంబాన్ని బయటకు గెంటేసిన దృశ్యాలను కొందరు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఆ వీడియోను ఇప్పటికి చాలామంది వీక్షించారు.

తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా ధియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ధియేటర్లో ప్రదర్శించాల్సిందిగా ఒక చట్టాన్ని తీసుకువచ్చిందట. సదరు చట్టం కారణంగా పివిఆర్‌ ధియేటర్లో ప్రతీ రోజూ జాతీయగీతాన్ని ప్రదర్శిస్తున్నామని, కానీ ఒక కుటుంబానికి చెందిన కొంతమంది జాతీయగీతాన్ని గౌరవించని కారణంగా, ఇతర ప్రేక్షకులతో వాగ్వివాదం జరిగిందని, దీనితో తప్పని సరిగా సదరు కుటుంబాన్ని ధియేటర్‌నుండి బయటకు పంపివేయడం జరిగిందటని ధియేటర్‌ యాజమాన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఎటువంటి కేసులు కూడా నమోదు చేయలేదట.

కులమతాలకు సంబంధం లేకుండా దేశంలోని ప్రతీ ఒక్కరూ జాతీయగీతాన్ని గౌరవించడం తప్పని సరి చేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే తీర్పు వెలువరించింది.


English summary

The Muslim family is forced to leave the cinema theatre.The people present in the theatre says that the muslim family was not respecting the India's National Anthem. This incident occured in mumbai