మగోడికి పెద్ద మనిషి ఫంక్షన్.. షాకింగ్ న్యూస్ (వీడియో)

Family hosts grand event for 17 year old son first shave

11:20 AM ON 7th June, 2016 By Mirchi Vilas

Family hosts grand event for 17 year old son first shave

ఇదేమి చోద్యం అనుకుంటున్నారా నిజం.. ఈ కాలంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు రకరకాల ఫంక్షన్లు అందుబాటులోకి తెచ్చేస్తున్నారు. ఇదీ అలాంటిదే. ఆడపిల్లలకు వోణి పేరంటం లాంటి రకరకాల సెలబ్రేషన్స్ వున్నాయ్. పెద్ద మనిషి అయిందంటూ పెద్ద ఫంక్షన్ చేస్తారు. మరి అబ్బాయిలకు మాత్రం బర్త్ డే ఫంక్షన్ కంటే దిక్కులేదు. కౌమార దశలోకి ఎంట్రీ ఇచ్చి మూతి మీద నాలుగు మీసాలు మొలిచినా.. చప్పుడు చేయకుండానే వుండిపోతారు. ఇది ఓ విధంగా మగాళ్ళకు వెలితిగా ఉందన్న విషయాన్నీ గుర్తించారో ఏమో గానీ .. మావోడు పెద్దోడయ్యాడోచ్ అంటూ ఓ మరాఠీ కుటుంబం సందడి చేసేసింది.

అరుదైన ఈ ఫంక్షన్ గురించి ప్రస్తావిస్తే, థానెలోని ఓ బాబుకి 17వ పుట్టినరోజును ‘షేవింగ్ డే’ అంటూ ఒక పేరు పెట్టుకుని దానినొక మెగా ఈవెంట్గా జరుపుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది. మహారాష్ర్టలో ఇంటర్ పరీక్షలు రాసిన 17 ఏళ్ల ద్వీప్ భగత్.. పెద్దవాడు అయ్యాడని, అందుకు గుర్తుగా సమీపంలోని అశోక్ సదన్హాలులో బాలుడి తండ్రి జితేంద్ర భగత్ ఒక ఫంక్షన్ నిర్వహించాడు. ఫ్లెక్సీలను పెట్టి తన కొడుక్కి ‘ఫస్ట్ షేవింగ్’ అంటూ గ్రాండ్గా కార్యక్రమం చేపట్టాడు. దీనికి దాదాపు 250 మంది అతిథులను ఆహ్వానించాడు. అందులో స్నేహితులు, దగ్గర బంధువులు, ఇరుగుపొరుగు వారు కూడా వున్నారు. పుట్టినరోజు, పేరు పెట్టడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం చూస్తున్నామని, తొలిసారి తన కొడుకు ఎదిగాడు అని చెప్పడం చాలా హ్యాపీగా వుందని జితేంద్ర అంటున్నాడు. ద్వీప్కి ఎనిమిదేళ్లు వున్నప్పుడే ఫంక్షన్ చేయాలని భావించానని, ఆ ఆలోచనను ఇప్పుడు కార్యరూపం దాల్చినట్టు చెప్పుకొచ్చాడు. ఓ చోటా మొదలైతే చాలు , ఇలాంటివి ఆనోటా ఈనోటా పాకడం , మరికొందరు ఇలాంటి ఫంక్షన్లు చేయడం సహజమేగా .. పైగా నెట్ పుణ్యామా అని పైసా ఖర్చు లేకుండా ఇలాంటి విషయాలు క్షణాల్లో విశ్వవ్యాప్తం కూడా అయిపోతున్నాయి కదా ..

ఇది కూడా చూడండి:స్టార్ హీరోలకు ఆ సత్తా లేదా అంటూ క్లాస్ పీకిన దాసరి

ఇది కూడా చూడండి:హార్ట్ బీట్ పెంచేస్తున్న దీపికా(వీడియో)

ఇది కూడా చూడండి:అమెరికాలో బాలయ్య రేంజ్ చూస్తే, షాక్

English summary

Family hosts grand event for 17 year old son first shave.