అంత్యక్రియలయిన 10రోజులకు ఏమైందో తెలుసా?

Family members did funeral for his son

10:39 AM ON 14th October, 2016 By Mirchi Vilas

Family members did funeral for his son

ప్రపంచంలో అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అదే మిరాకిల్ అంటారు. సరిగ్గా పంజాబ్ లోని జలంధర్ లో అలాంటి ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చనిపోయాడనుకుని మనిషికి అంత్యక్రియలు చేసిన 10 రోజులకు ఆ వ్యక్తి చనిపోలేదని తెలిసింది. దీంతో ఆ కుటుంబానికి దిమ్మతిరిగిపోయింది. మొదట ఆశ్చర్యం వ్యక్తం చేసినా, ఆతర్వాత తేరుకుని, మనిషి బతికున్నాడనే విషయం తెలిసి సంతోషపడింది. జలంధర్ కు చెందిన చందన్ కుమార్ వ్యాపార నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లాడు. సెప్టెంబర్ 29వ తేదీన చందన్ ఇంటి నుంచి వెళ్లాడు. అతను వెళ్లిన మరుసటి రోజు హిమాచల్ ప్రదేశ్ లోని ఉన నుంచి ఇంటికి ఫోనొచ్చింది.

పంజాబ్ - హిమాచల్ బోర్డర్ లో ఓ మృతదేహం కనిపించిందని, కారు కూడా ఉందని ఫోన్ చేశారు. అక్కడ దొరికిన వివరాల ఆధారంగా ఫోన్ చేశామని తెలిపారు. వెంటనే హడావుడిగా చందన్ కుటుంబం అక్కడికి వెళ్లారు. అక్కడ కనిపించిన కారు నెంబర్ వారిదే కావడంతో చనిపోయింది చందనే అనుకున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో అందరూ చందన్ అనుకుని భ్రమపడ్డారు. ఇక చేసేదిలేక మృతదేహాన్ని జలంధర్ కు తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా చేశారు. ఆ తర్వాత 10 రోజులకు ఆ కుటుంబసభ్యులకు చందన్ బతికే ఉన్నాడన్న సమాచారం అందింది.

చందన్ కిడ్నాపయ్యాడన్న విషయం దసరా రోజు అతని తమ్ముడు గుల్షాన్ కు తెల్సింది. చందన్ భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చందన్ ఎక్కడున్నాడనే విషయం తెలియకూడదనే ఉద్ధేశంతోనే కిడ్నాపర్లు అతను చనిపోయినట్లు హైడ్రామా నడిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Family members did funeral for his son