వామ్మో..  ఆ ఈతచెట్టు పగలు వాలిపోయి.. రాత్రి లేచి నిలబడుతోందట!

Famous eetha chettu in Kondamunjuluru

03:58 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Famous eetha chettu in Kondamunjuluru

అవును మీరు వింటుంది నిజమే.. ఈ వింత ఎక్కడంటే ప్రకాశం జిల్లాలోని కొండముంజులూరు గ్రామంలో చోటు చేసుకుంటుంది.. ఇప్పుడా ఊరు ఈత చెట్టుతో ఫేమస్ అయిపోయింది. ఈతచెట్టు పగలు వాలిపోయి ఉండటం.. రాత్రి లేచి నిలబడి ఉండటాన్ని మొదట సుబ్బారావు అనే వ్యక్తి చూశాడట. ఉండబట్టలేక బంధువులకు చెప్పాడు. అలా అలా ఊరంతా ఈ వార్త పాకిపోయింది. మొదట అందరూ భయపడ్డారు. ఆ తరువాత భక్తిలోకి మారిపోయింది. అంతే ఆ చెట్టుకి పూజలు చేయడం మొదలుపెట్టారు. అయితే అక్కడ ఎలాంటి మహిమలు లేవని కేవలం భూమి పొరల్లో జరిగిన మార్పుల వల్లే ఈతచెట్టు పడిపోయిందని అంటున్నారు హార్టీకల్చర్ ప్రొఫెసర్లు.

ప్రకాశం జిల్లాలో ఎక్కువశాతం బంకమట్టి వుండడంతోపాటు జిల్లాలో అత్యధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. బంకమట్టి దగ్గరగా స్వభావాన్ని కోల్పోయి వదులుగా మారుతుంది. దీనివల్లే చెట్టు పగటిపూట వాలిపోతోంది.. రాత్రి వేళల్లో వేడి తగ్గడం వల్ల తిరిగి యథాస్థానానికి వస్తుందని చెబుతున్నారు నిపుణులు. గ్రామస్తులు మాత్రం పూజలు మానలేదట.

English summary

Famous eetha chettu in Kondamunjuluru