అల్లు శిరీష్‌తో ఐటమ్‌సాంగ్‌!

Famous Heroine doing Item song with Allu Sirish

06:37 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Famous Heroine doing Item song with Allu Sirish

'అనుమానస్పదం' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన హంసా నందిని ఈ చిత్రం అపజయంతో ఆశించినంత గుర్తింపు రాక ఐటమ్‌సాంగ్స్‌, క్యారెక్టర్‌ రోల్స్‌ చేస్తూ కెరీర్‌ను సాగిస్తుంది. ఈ ఏడాది విడుదలైన రుద్రమదేవి, బైంగాల్‌ టైగర్‌ చిత్రాలలో ఐటమ్‌ సాంగ్స్‌లో కనిపించి మెప్పించిన హంసా నందిని తాజాగా మరో చిత్రంలో కూడా నటిస్తుంది. అల్లుఅర్జున్‌ సోదరుడైన అల్లుశిరీష్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది.

ఈ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌తో పాటు ఒక ముఖ్యమైన పాత్రలో హంసా నందిని కనిపించనుంది. ఇందులో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఇంత వరకు ఎప్పుడూ చూడని పాత్రలో నేను కనిపించిబోతున్నాను, నా రోల్‌ అందరినీ ధ్రిల్‌కి గురి చేస్తుంది అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది హంసా నందిని. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

English summary

Hamsa Nandini doing Item song with Allu Sirish in his upcoming film.