పవన్ పై అభిమానుల  గుర్రు!

Fans Angry On Pawan Kalyan

06:03 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Fans Angry On Pawan Kalyan

ఎపిలోని తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు జరిగిన కాపు ఐక్య గర్జన సభ అనంతరం చోటుచేసుకున్న విద్వంస పరిణామాల నేపథ్యంలో అదే వర్గానికి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. 'అంత పెద్దయెత్తున జనం వచ్చినప్పుడు అందుకు అనుగుణంగా బందోబస్తు వుండి వుంటే, హింసాత్మక ఘటనలు జరిగేవి కాదు. ఉద్యమం నడిపే వాళ్లకు హక్కుల సాధనతో పాటు సంయమనం వుండాలి. కాపులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటా మన్ననమ్మకాన్ని ప్రభుత్వం కల్పించలేక పోయింది' ఇలా అందరినీ తప్పు బడుతున్నట్లు మాట్లాడిన మాటలు అభిమానులకు రుచించడం లేదు. పవన్ స్పందన గోడమీద పిల్లి వాటంగా ఉందని కాపు అభిమానులే అనేస్తున్నారు. అభిమానించిన వాళ్ళే ఆగ్రహంతో మండిపోయి పవన్ పోస్టర్లను చించేశారట. ఇది తాజాగా గుంటూరు జిల్లా రేపల్లెలో చోటుచేసుకుంది. ఒకప్పుడు వారు పెట్టిన పోస్లర్లనే వారు చించిపడేశారు.

కేరళలో జరుగుతున్న సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ వదులుకొని మరీ హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన పవన్ నుంచి కాపు అభిమానులు చాలా ఆశించారు. అంతకు ముందే అన్న మెగాస్టార్ సైతం చంద్రబాబుని తప్పు పడుతూ, లేఖాస్త్రం సంధించడంతో, పవన్ కూడా దులిపేస్తాడని భావించారు. అయితే పవన్ మాత్రం చంద్రబాబును నొప్పించకుండా తాను కాపులకు ఒక్కరికే ప్రతినిధిని కానని, అందరికీ ప్రతినిధిని అంటూ కాపు నేతలకే గడ్డిపెట్టినట్లు మాట్లాడడం దారుణమని రేపల్లె అభిమానులు బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయడమే కాదు చేతికి పని చెప్పేశారు. తమకు నచ్చని విధంగా మాట్లాడితే బాధపడం కానీ , ఎదుటి వారిని కాపాడే విధంగా చెబితే మాత్రం సహించేది లేదని పవన్ అంటే పడిచచ్చే కాపు అభిమానులు తెగేసి చెప్పేస్తున్నారట.

English summary

Recently Kapu Ikya Mahagarjana event was done in Tuni in East Godavari District.Pawan kalyan was came from his shooting location and opposed that incident in a press meet.Due to that some of the pawan kalyan fans were got angry and teared pawan kalyan posters in Guntur District