ఫేస్ బుక్ లో వ్యంగంగా పోస్టు పెట్టాడని చితకబాదారు(వీడియో)

Fans beaten a student for posting about actors in FaceBook

02:06 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Fans beaten a student for posting about actors in FaceBook

రోజులు మామూలుగా లేవు. అసలు విమర్శలను తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఎప్పుడు ఏమవుతుందో తెలీని దుస్థితి నెలకొంది. కర్ణాటకలో ఇలాంటి ఉదంతమే చోటుచేసుకుంది. కన్నడ నటులపై వ్యంగ్యంగా వ్యాఖ్యలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన 22 ఏళ్ళ విద్యార్థి సంతోష్ పై దాడికి తెగబడ్డారు. కావేరీ ఝాల వివాదంపై కన్నడ నటులు నిరసన వ్యక్తం చేయడంపై సంతోష్ కామెంట్లు పెట్టాడని కన్నడ మీడియా పేర్కొంది. రోజుకు 15 వేల క్యూసెక్కుల కావేరీ జలాలను పది రోజులపాటు తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాష్ట్ర బంద్ కూడా జరిగింది.

ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అనేక కన్నడ సంఘాలు వీథుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కన్నడ మీడియా కథనాల ప్రకారం శ్రీరామపురం నివాసి సంతోష్ బనశంకరిలోని ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న కన్నడ నటులు శివరాజ్ కుమార్, దునియా విజయ్, రాగిణి ద్వివేది, దర్శన్ లపై ఫేస్ బుక్ లో వ్యంగ్యంగా వ్యాఖ్యలు పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నటుల అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో శనివారం సాయంత్రం కళాశాలకు వచ్చిన సంతోష్ ను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా హల్ చల్ అయింది.

ఐదుగురు వ్యక్తులు సంతోష్ ను చుట్టుముట్టి, అతని ముఖంపై కొడుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. దాడికి పాల్పడినవారు సంతోష్ ను గిరినగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి, ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఓ పత్రిక తెలిపింది. అయితే పోలీసులు ఈ మీడియా కథనాన్ని ఖండించారు. తమ వద్దకు బాధితులుగానీ, నింధితులు కానీ రాలేదన్నారు. ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తామని అంటున్నారు.

ఇది కూడా చదవండి: సొంత ఇంటిని అమ్మకానికి పెట్టిన టాప్ డైరెక్టర్!

ఇది కూడా చదవండి: మార్కెట్ లో రాధికా ఆప్టే బ్లూ ఫిలిం సీడీలు!

ఇది కూడా చదవండి: అక్కడ వినాయకుడికి నైవేద్యంగా పెట్టివి ఏంటో తెలిస్తే షాకవుతారు!

English summary

Fans beaten a student for posting about actors in FaceBook. A 23 years student posted opposite words about Kannada actors in FaceBook.