చెన్నైలో 'జనతా గ్యారేజ్' ఫుల్

Fans came to see Ntr in Chennai

10:36 AM ON 3rd June, 2016 By Mirchi Vilas

Fans came to see Ntr in Chennai

అదేమిటి సినిమా ఇంకా రిలీజ్ కాకుండా ఫుల్ అయిందని అనుకుంటున్నారా? అది కాదండి.. చెన్నైలో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డంతా జనాలతో నిండిపోయింది. అయితే ఇందుకు కారణం ఏమిటబ్బా అని చూస్తే.. జనతా గ్యారేజ్ సినిమాయే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నఈ సినిమా షూటింగ్ శరవేగంగా చెన్నైలో జరుగుతోంది కదా. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనతా గ్యారేజ్ కి దర్శకుడు కొరటాల శివ. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులంతా పొలోమంటూ స్టూడియో దగ్గరకు చేరేసారు.

చాంతాడంత క్యూలు కట్టి బారులు తీరారు. ఎన్టీఆర్ ని, షూటింగ్ ను చూసేందుకు ఉబలాట పడి వీళ్ళంతా ఇక్కడికి చేరుకున్నారని నటుడు బ్రహ్మాజీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నాడు. చెన్నైలో ట్రాఫిక్ జామ్.. తారకరాముడి దర్శనం కోసం అని పోస్ట్ చేశాడు.

English summary

Fans came to see Ntr in Chennai