రజనీ రావాల్సిందే !!!!

Fans Demand For Rajini Political Entry

01:06 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Fans Demand For Rajini Political Entry

తమిళ నాట సూపర్ స్టార్ రజనీకాంత్ కున్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. రజనీ స్టైల్ అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది... అభిమానులను అలరిస్తుంది..... ఫాలో చేస్తుంది ... ఓ సారి చెబితే వందసార్లు చెప్పినట్టే అనే డైలాగ్ కి అనుగుణంగా రజనీ కనుసైగ చేస్తే చాలు అభిమానులకు శిరోధార్యం అవుంతుంది... అయితే ఇప్పుడు అభిమానులు ఓ అడుగు ముందుకేసి రాజకీయాల్లోకి రావాల్సిందే నని పట్టుబట్టేస్తున్నారు. ఏకంగా పోస్టర్లు కూడా వేసేసారు.

ఓ సినిమా తర్వాత మరో సినిమా చేసే ప్రస్తుత నటులకు భిన్నంగా ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్ లో రజనీ బిజీబిజీగా ఉంటూ, షెడ్యూల్ అడ్జెస్ట్ మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే, మరోవైపు రాజకీయ ప్రవేశం చేయాలని ఆయన అభిమానుల డిమాండ్ తారా స్థాయికి చేరింది. ఇక కొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ఇక ఎంతమాత్రం జాప్యం వద్దని అభిమానులు దూకుడు పెంచేశారు. సూపర్ స్టార్ ని రాజకీయాల్లోకి రావాలని తొందర పెట్టేస్తూ, వినతులు పంపే సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడమే కాదు, రజనీ రాజకీయ అరంగ్రేటం కోసం ఆయన అభిమానులు పోస్టర్ల మీద పోస్టర్లు ముద్రించి, హంగామా చేసేస్తున్నారు. రజనీ కానీ రాజకీయాల్లోకి రాకుంటే తాము నిరాహారదీక్షలు చేస్తామంటూ రజనీకాంత్ అభిమాన సంఘాల సమాఖ్య ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో తన రాజకీయ అరంగ్రేటాన్ని ప్రకటించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. మరోవైపు.. ఈ విషయాలపై రజనీ నోరు మెదపటం లేదు. ఆయన మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వాల పని తీరుతో విసిగిపోయామని.. ఈసారి ఎన్నికల బరిలో రజనీ రంగప్రవేశం చేయాలన్న డిమాండ్ పై రజనీ తలొగ్గుతారో, ఎప్పటిలాగే సున్నితంగా తిరస్కరిస్తారో ....

English summary

Superstar rajini kanth has huge following around the world.His fans were forcing him to do political entry , but previously rajinikanth rejected many times,Now in tamilnadu his fans sticked posters by asking him to enter in politics