బన్నీ మాటలకు ఫ్యాన్స్ డిష్యుం డిష్యుం

Fans Fight During Bunny's Speech

03:15 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Fans Fight During Bunny's Speech

హాట్‌ టాపిక్‌గా మారిన అల్లు అర్జున్‌ డైలాగ్‌ గురించి అందరికీ తెలిసిందే. దాంతో అల్లు అర్జున్‌ ఆ డైలాగ్‌ గురించి నిహారిక నటించిన 'ఒక మనసు' చిత్రం ఆడియో ఫంక్షన్‌ లో వివరణ ఇచ్చాడు. అయితే అల్లు అర్జున్‌ మాట్లాడుతుండగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌, పవన్‌ ఫ్యాన్స్‌ అక్కడే కొట్టుకున్నారట.

ఇది కూడా చూడండి :

బన్నీ స్వీచ్‌ ఇస్తున్న సమయంలో పవన్‌ ఫ్యాన్స్‌ కొంతమంది బన్నీ ఫ్యాన్స్‌ కొంతమంది కొట్టేసుకున్నారట. అల్లు అర్జున్‌ మాటలకు పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఒకరు సెటైర్‌ వేయడంతో బన్నీ ఫ్యాన్‌ కి కోపం వచ్చి గొడవకి దిగారని సమాచారం. ఇలా పవన్‌ ఫ్యాన్‌ సెటైర్‌ వేయడం వల్లే గొడవ మొదలైందని చెప్పుకుంటున్నారు.

ఇది కూడా చూడండి :

మళ్ళా పవర్‌ స్టార్‌ అన్న కేకలు హోరెత్తడంతో బన్నీ ఒక నిమిషం గ్యాప్‌ ఇచ్చి... పవర్‌ స్టార్‌ అని అరిచిన ప్రతిసారి మాట్లాడకుండా వెళ్ళి పోవడానికి కారణం పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అని అన్నారు. పవర్‌ స్టార్‌ గారు ఇలా ఉన్నారంటే దానికి కారణం చిరంజీవి గారే అని వందల సార్లు పవన్‌ చెప్పారని అన్నారు. అలాంటి అంతటి గొప్ప స్థాయిలో ఉన్న చిరంజీవి గారు మాట్లాడుతుంటే కూడా పవన్‌ పవన్‌ అని అరవడం తనను ఇబ్బందికి గురి చేసిందని బన్నీ తెలిపాడు. అభిమానులంతా అర్ధం చేసుకుంటారని బన్నీ ఆశాభావం వ్యక్తం చేసారు.

ఇది కూడా చూడండి :

English summary

Allu Arjun Fans and Power Star Pawan Kalyan Fans Fight During Bunny's Speech.