అతను చేసిన పనికి మెచ్చి 4.5 కోట్లు తనపై కురిపించారు(వీడియో)

Fans gave 4.5 crores to a singer

11:36 AM ON 9th September, 2016 By Mirchi Vilas

Fans gave 4.5 crores to a singer

ఇది నీటి వర్షం కాదు, మంచు వర్షం అంత కన్నా కాదు.. నోట్ల వర్షం.. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగున్నర కోట్ల నోట్ల వర్షం అతనిపై కుమ్మరించారు.. ఇంతకీ ఎవరతను? దీని గురించి వివరాల్లోకి వెళితే.. కళాకారులపై జనానికి అభిమానం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలిపే సంఘటన ఇది. గుజరాత్ లోని జామ్ నగర్ కు చెందిన గుజరాతీ జానపద గాయకుడు కీర్తిదాన్ గధ్వి తియ్యని గొంతుతో పాడుతూ ఉంటే అభిమానులు మైమరచిపోతున్నారు. ఆయన గొంతెత్తి పాడితే చాలు కరెన్సీ నోట్ల కట్టలు కుమ్మరిస్తున్నారు. రూ.500 నోట్లతో ఆయనను ముంచెత్తుతున్నారు.

ఆయన 2015లో మొదటిసారి వెలుగులోకి వచ్చారు. అప్పట్లో ఆయన జామ్ నగర్ లో గో సంరక్షణ సభలో పాడారు. ఆయన పాటలోని మాధుర్యం అందరికీ ఆనందాన్ని పంచింది. అప్పటి నుంచి ఆయన పాట అంటే జనం చెవి కోసుకుంటున్నారు. డబ్బులతో అభిషేకం చేస్తున్నారు. ఈ సొమ్ము విలువ రూ. 4.5 కోట్లు అని చెప్తున్నారు. అయితే, సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను చూసినవాళ్ళలో కొందరు ఈ కరెన్సీ కట్టలు నకిలీవేమోననే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: స్టూడెంట్సే కదా అని క్లోజ్ గా ఉంటే టీచర్ కి చుక్కలు చూపించారు(వీడియో)

ఇది కూడా చదవండి: పోర్న్ సైట్ లో విజయవాడ అమ్మాయి నగ్న వీడియో

ఇది కూడా చదవండి: అఖిల్ పెళ్లి ఫిక్స్ .. డిసెంబర్ 9న నిశ్చితార్ధం

English summary

Fans gave 4.5 crores to a singer