అసలు అక్షయ్ కి ఏం జరిగింది - సారీ ఎందుకు చెప్పాడు

Fans Injured With Blade Says Akshay Kumar

11:01 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Fans Injured With Blade Says Akshay Kumar

ఫిలిం సెలబ్రిటీల అభిమానుల పై ఈ మధ్య వారి బాడీ గార్డులు సహనం కోల్పోయి భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెలబ్రిటీలు కూడా గాయాల పాలవుతున్నారు కూడా. ముఖ్యంగా సినీ తారల బాడీగార్డ్స్‌కు, వారి అభిమానులకు మధ్య చోటు ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న ఘర్షణలు ఫిలిం సెలబ్రిటీలకు తలనొప్పిగా మారాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బాడీగార్డ్ ఒకరు ఆయన ఫ్యాన్‌ పై చెయ్యి చేసుకున్న సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఒక అభిమాని అక్షయ్‌తో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహపడుతూ ఆ హీరో దగ్గరకు వస్తుండగా ఆయన బాడీగార్డు అతన్ని అడ్డుకునేందుకు చెయ్యి చేసుకున్నాడు. ఈ సీన్‌ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా ఇప్పుడు అగ్గిలా రాజుకుంది. అభిమానులనే కొట్టిస్తారా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో అక్షయ్ స్పందిస్తూ, తన బాడీగార్డ్ చేసింది తప్పేనని ఒప్పుకుని, ఇలాంటి సంఘటనలు మరోసారి మళ్ళీ జరగకుండా చూసుకుంటానని క్షమాపణ చెప్పాడు.పరిస్థితులు చెయ్యిదాటుతున్నప్పుడు తమను రక్షించడానికి బాడీగార్డ్‌లు సిద్ధంగా ఉంటారని అయితే ఎవరిపైనయినా చెయ్యెత్తడం సరికాదని అక్షయ్ అంగీకరించాడు.

ఇవి కూడా చదవండి:పిల్లాడే కదా అని ముద్దులు కురిపిస్తే ..

అయితే, రెండు మూడేళ్ళ కిందట అభిమానుల పేరుతో వచ్చిన కొందరు వ్యక్తులు తన చేతిని బ్లేడుతో కోసేశారని తనకెదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ వ్యక్తులకు తాను షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికి తన చేతి నుంచి రక్తం కారిందన్నాడు. "వారిలో ఒక వ్యక్తి చేతి వేళ్ళ మధ్య బ్లేడు ఉంచుకుని నా చెయ్యి కోశాడు.." అని అక్షయ్ తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో తామేం చెయ్యాలో చెప్పాలని అడిగాడు. అభిమానుల అత్యుత్సాహం వల్ల తమ బాడీగార్డులు కూడా గాయపడిన సందర్భాలున్నాయన్నాడు. ముఖ్యంగా అభిమానుల పేరుతో వచ్చే కొందరు వ్యక్తుల నుంచి హీరోయిన్లు మరింత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నారని, బాడీగార్డులే లేకపోతే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అక్షయ్ తదుపరి చిత్రం "హౌస్‌ఫుల్ 3" కోసం రూపొందించిన ఆడియో లాంచ్ కార్యక్రమం సందర్భంగా తన అవేదన ఇలా బహిర్గతం చేసాడు.

ఇవి కూడా చదవండి:రాజీవ్‌ కనకాల చెంప పగలగొట్టిన రష్మీ

ఇవి కూడా చదవండి:కాజల్ బ్యాక్ అంటే మహేష్ సెంటిమెంట్

English summary

Bollywood Hero Akshay Kumar gives clarity on the Controversy of his Body Gaurds beaten Fans in Airport. He says that one day one fan approcahed him and he shake hand with him and he cuts his hand by blade.