అక్కడికి మేకప్ లేకుండా వెళ్లడంతో కాజల్ ని పట్టించుకోని జనాలు!

Fans not identified Kajal Agarwal that she was without makeup

04:45 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Fans not identified Kajal Agarwal that she was without makeup

మేకప్ వేసుకుంటే మన హీరోయిన్లు ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మేకప్ తో మన హీరోయిన్లు దివి నుంచి దిగి వచ్చిన అప్సరసల్లా కనిపిస్తారు. ఆ మేకప్ తోనే హీరోయిన్లు 'ఆర్డినరీ' నుంచి 'ఎక్స్ ట్రార్డినరీ'గా కనిపిస్తారు. ఆ మేకప్ లేకపోతే హీరోయిన్లను ఎవరూ చూడలేరు. ఇలాంటి చేదు అనుభవమే టాప్ హీరోయిన్ కి ఎదురైంది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా అమెరికాలో ఆటా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అందులో మన టాలీవుడ్ నటీనటులు పాల్గొన్నారు. ఇందులో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో పాటు రీసెంట్ గా హిట్లు కొడుతున్న రాశీఖన్నా కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో రాశీఖన్నా ఫుల్ మేకప్ తో అదరగొట్టే డ్రెస్ తో వస్తే..

కాజల్ అగర్వాల్ మాత్రం మేకప్ లేకుండా కాజువల్ గా వచ్చేసిందట. దీంతో జనాలు కాజల్ అగర్వాల్ ను అస్సలు గుర్తుపట్టలేదట. కొందరు గుర్తుపట్టినా ఈమె ఏంటి ఇలా ఉంది అంటూ పెదవి విరిచారట. దీంతో జనాలు కాజల్ అగర్వాల్ ను పట్టించుకోకుండా రాశీఖన్నా వెనుకపడ్డారని తెలుస్తోంది. మేకప్ లేకుండా వచ్చినంత మాత్రాన తనను పట్టించుకోకుండా తనకంటే చిన్న హీరోయిన్ వెనుక జనాలు పడటంతో కాజల్ అగర్వాల్ చాలా హర్టయిందట. మరోవైపు మేకప్ లేకుంటే హీరోయిన్ల అసలు అందం బయటపడిపోతుందని, పబ్లిక్ పంక్షన్లకు వచ్చినప్పుడు మేకప్ తో వస్తేనే మంచిదని లేకుంటే ఇలాంటి చేదు అనుభవమే ఎదురవుతుందని గుసగుసలాడుకుంటున్నారు.

English summary

Fans not identified Kajal Agarwal that she was without makeup