పబ్లిక్‌లో తాప్సీ చీర లాగేశాడు

Fans pulled Taapsee saree in public

06:47 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Fans pulled Taapsee saree in public

ఝమ్మంది నాదం, మిస్టర్ పర్ఫెక్ట్ , దరువు, గంగ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ కొంత కాలంగా తెలుగు చిత్రాలకంటే తమిళం, హిందీ సినిమా ల పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అయితే తాప్సీ ఇటీవలే చెన్నైలోని ఒక షోరూమ్‌ ప్రారంభానికి ముఖ్య అతిధిగా విచ్చేసింది. స్వతహాగా సెలబ్రిటీలంటే ఎంతో మంది అభిమానులు తరలి రావడం ఖాయం. తాప్సీ వచ్చినప్పుడు కూడా ఇలాగే అభిమానులు వచ్చారు. అంతేకాదు ఎక్కువ మంది రావండతో అక్కడ సిబ్బంది కూడా వారిని ఆపలేక పోయారు. దీనితో వాళ్ళు తాప్సీ ని సెల్ఫీ లంటూ చుట్టు ముట్టేయడమే కాకుండా, తాప్సీ చేతులు పట్టుకుని లాగి తాప్సీ చీరని కూడా లాగేశారు.

దీనితో అక్కడ సిబ్బంది అప్రమత్తమవ్వడంతో తాప్సీని సురక్షితంగా వారి నుండి విడిపించారు. దీనితో ఆగ్రహం వచ్చిన తాప్సీ ఆ షోరూమ్‌ సిబ్బంది మీద విరుచుకుపడింది. ఇలా షోరూమ్‌ ఈవెంట్‌కి ఆహ్వానించినప్పుడు సరిగ్గా ఆర్గనైజ్‌ చెయ్యడం రాదా అని వారిపై ధ్వజమెత్తింది.

English summary

Fans pulled Taapsee saree in showroom opening. She went as a chief guest for new show room opening in Chennai.