ప్రణీత ని ద్రోహి అంటున్న అభిమానులు!!

Fans says Pranitha is cheater

10:42 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Fans says Pranitha is cheater

ప్రణీత అభిమానులు ప్రణీత ని ఒక ద్రోహి అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఎప్పుడూ మీడియా ముందుకు కూడా రాని ప్రణీత వార్తల్లోకి వచ్చింది. అసలు ప్రణీత చేసిన తప్పేంటి? ఎందుకు తనని దుమ్మెత్తి పోస్తున్నారు? దీనికి అసలు కారణం ఏమిటంటే ఇప్పటి వరకూ జరిగిన సెలెబ్రిటీ క్రికెట్‌ టార్నమెంట్‌లలో కర్ణాటక జట్టుకు బ్రాండ్‌ అంబాసిడర్ గా ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు టీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుందట. దీంతో ఆమె పై చాలా కామెంట్లు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కొంతమంది ఈమెను జట్లు మార్చే ద్రోహి అని విమర్శిస్తున్నారు.

ఇంతగా ఆమెను విమర్శించడంతో ప్రణీత చాలా షాక్‌ అయ్యింది. ఏమాత్రం మర్యాద లేకుండా ఇలాంటి కామెంట్లు చెయ్యడం తనకు చాలా బాధగా ఉందని ప్రణీత చెప్పింది. తమను టీంలో భాగస్వామిగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఇటీవల కాలంలో తను తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల తెలుగు టీమ్ తనను సంప్రదించారనీ, తెలుగు టీంతో భాగస్వామ్యం తనకు కూడా సంతోషంగానే ఉందనీ ప్రణీత చెప్పింది.

English summary

Kannada heroine Pranitha Subhash fans says that she is a cheater. She is brand ambassador of Kannada CCL team. But now she is Telugu team brand ambassador.