డబ్బిచ్చే వాళ్ళే సన్నీ లియోన్ అభిమానులట!

Fans Were Important Not Critics Says Sunny Leone

10:48 AM ON 27th April, 2016 By Mirchi Vilas

Fans Were Important Not Critics Says Sunny Leone

అబ్బో ఈ అమ్మడు చెప్పేది వింతగా వుందే ... అయితే ఓసారి వివరాల్లోకి వెళ్ళాల్సిందే...  అవార్డుల కంటే అభిమానుల ప్రేమే తనకు ముఖ్యమని చెప్పే బాలీవుడ్‌ తారగా రాణిస్తున్న ఒకప్పటి అడల్ట్‌ స్టార్‌ సన్నీ లియోన్ గమ్మత్తైన వ్యాఖ్యలు చేసింది.  జాస్మిన్ డిసౌజా దర్శకత్వంలో ఆమె నాయికగా నటించిన ‘ఒన్ నైట్‌ స్టాండ్‌’ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక  విమర్శకుల అభిప్రాయం, అభిమానుల ప్రేమలో దేనికి ప్రాముఖ్యమిస్తారని అడిగితే, ‘‘విమర్శకులు సినిమా టిక్కెట్లను కొనరు. వాళ్లు ఉచితంగా సినిమా చూస్తారు. అదే అభిమానులైతే టిక్కెట్లను కొంటారు. నాకు సంబంధించినంత వరకు అభిమానులకే ప్రాధాన్యం. ఏ అవార్డులనూ నేను ఆశించను. కేవలం నా అభిమానుల ప్రేమనే కోరుకుంటా. వాళ్ల మద్దతునే నేను ఆశిస్తా’’ అని చెబుతోంది. ‘‘నటులుగా మేం ఎదురు చూసేది అలాంటి సినిమాల కోసమే. అయితే కంటెంట్‌ ప్రధాన చిత్రాలనేవి వ్యక్తుల అభిరుచి మీద ఆధారపడి ఉంటాయి. బలమైన విషయం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నా’’ అని చెప్పింది సన్నీ.

సన్నీ లియోన్ ప్రస్తుతం నటించిన ‘ఒన్ నైట్‌ స్టాండ్‌’ సినిమా విశేషాలు స్లైడ్ షోలో....

1/6 Pages

రానా మిస్

సన్నీ లియోన్ నటిస్తున్న తాజా చిత్రం "వన్ నైట్ స్టాండ్" సినిమాలో మొదట హీరో గా రానా చెయ్యాల్సి ఉండగా "బాహుబలి-2" సినిమా కారణంగా డేట్స్ ఖాళీ లేకపోవడంతో రానా స్థానంలో తనూజ్ విర్వాని నటించాడు.

English summary

Sunny Leone was presently acted in a film called "One Night Stand" in Bollywood. Recently in an interview she answered about the question that she like his fans because they will purchase movie tickets but critics wont buy movie tickwets they will see movie for free of cost. She also said that she like her fans.