లంచం ఇచ్చేందుకు బిచ్చగాడుగా మారిన కుర్రాడు

Farmers Son Had To Beg For Paying Bribe

10:50 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Farmers Son Had To Beg For Paying Bribe

లంచం ఇవ్వడం నేరం , పుచ్చుకోవడం నేరం అని ఎంత మొత్తుకున్నా , ఎన్ని కేసులు పెట్టినా లంచం జాడ్యం వదలడం లేదు. తాజాగా లంచం కోసం ఓ కుర్రాడ్ని బిచ్చమెత్తమన్నాడు ఓ అధికారి. ఇక గత్యంతరం లేక ఆ కుర్రాడు అదే పని చేశాడు. తమిళనాడు విల్లుపురం జిల్లా కున్నత్తూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన వివరాలకు వెళ్తే, 15 ఏళ్ల అజిత్ తండ్రి కోలాంజీ గత ఏడాది ఫిబ్రవరిలో మరణించాడు. ఆ రాష్ట్రంలో ఇలాంటి రైతు కుటుంబాలకు ‘ఫార్మర్స్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్’ కింద రూ.12,500 పరిహారంగా ప్రభుత్వం ఇస్తుంది.

అయితే, ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఆ మొత్తం ఇవ్వడానికి గ్రామాభివృద్ధి అధికారి అజిత్ ని రూ.3 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఆ డబ్బిస్తే.. ఈ మొత్తం తాలూకు చెక్ ఇస్తానన్నాడు. డబ్బుల్లేవని చెబితే, ముష్టి ఎత్తైన సరే ఇవ్వాల్సిందేనన్నాడట. అంతే, వెంటనే ఆ లంచం ఇవ్వడానికి అజిత్ బిచ్చగాడిగా మారిపోయాడు. బస్సులు, ఇతర ప్రాంతాల్లో డబ్బులకోసం దాదాపు ఏడాదిన్నరగా జోలెపట్టాడు. చివరకు ఈ ఉదంతం పై అధికారులకు తెలిసి, సుబ్రమణ్యం అనే గ్రామాభివృద్ధి అధికారిపై విచారణకు ఆదేశించారు. అజిత్ కు సాధ్యమైనంత త్వరలో పరిహారం చెల్లించాల్సిందిగా అధికారులను కోరారు.

ఇది కూడా చూడండి: ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

ఇది కూడా చూడండి: మేకప్ లేకుండా మన హీరోయిన్స్‌ను చూడలేం !!!

ఇది కూడా చూడండి: లేడీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జోస్యాలు ఇవే

English summary

Farmers died, Son Had To Beg For Paying Bribe.