మీ అబ్బ సొత్తా అంటూ మోడీని నిలదీశాడు!

Farooq Abdullah queations Narendra Modi

01:01 PM ON 26th November, 2016 By Mirchi Vilas

Farooq Abdullah queations Narendra Modi

జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో, ముఖ్యంగా పాక్ సరిహద్దులో యుద్ధవాతావరణం అలుముకుంటే, తాజాగా కాశ్మీర్ మాజీ సీఎం "పాక్ అక్రమిత కాశ్మీర్ మీ అబ్బ సొత్తా" అంటూ భారత్ ను నిలదీయడం ద్వారావివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీఓకే ప్రస్తుతం పాకిస్తాన్ అధీనంలో ఉంది. పీఓకే తమదేనంటూ భారత్ చేస్తున్న వాదనపై ఫరూక్ అబ్దుల్లా చీనాబ్ వ్యాలీలో జరిగిన ఒక ర్యాలీలో నిప్పులు చెరిగారు. ఈ ర్యాలీలో ఫరూక్ తో పాటు ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా... పీఓకే భారత్ వారసత్వ ఆస్తి కాదని అనేసారు. మోడీజీ... "ఇది మీ అబ్బ సొత్తా" అంటూ నిలదీశారు.

కాశ్మీర్ సమస్యపై మాట్లాడుతూ, కశ్మీర్ సమస్య విషయంలో పాకిస్తాన్ కూ భాగస్వామ్యం ఉందని, దీన్ని భారత ప్రభుత్వం కూడా ఒప్పుకుందన్నారు. సమస్య పరిష్కారానికి పాకిస్తాన్ తో చర్చలు జరపడం మినహా మరో గత్యంతరం లేదన్నారు. అలా జరిగితేనే జమ్మూకశ్మీర్ ప్రజలపై జరుగుతున్న అకృత్యాలకు తెరపడుతుందని ఫరూక్ వ్యాఖ్యానించారు. ఇండియా, పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై గత ఆదివారంనాడు కూడా ఫరూక్ ప్రస్తావిస్తూ, ఇరు దేశాలు కూర్చుని దీనిపై చర్చించుకోవాలని, యుద్ధం పరిష్కారం కాదని పేర్కొన్నారు. మరి ఫరూక్ వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

1/1 Pages

English summary

Farooq Abdullah queations Narendra Modi