కన్న కూతురు పైనే అత్యాచారం 

Father Raped His Daughter

12:16 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Father Raped His Daughter

మహిళలపై రోజు రోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయని అనే కొద్దీ దారుణాలు తీవ్రమవుతున్నాయి. చివరికి కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే తన కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇది ఎక్కడో ఆటవిక ప్రాంతంలో కాదు చైతన్యానికి మారుపేరైన తూర్పు గోదావరి అందునా కోనసీమలో చోటుచేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం, వివరాల్లోకి వెళితే , తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో నెల్లివారిపేటకు చెందిన చింతపల్లి వెంకటేశ్వరరావు తన కూతురి(17)పై మద్యం మత్తులో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం బాలికకు వాంతుల య్యాయి. దీంతో అక్కడ మహిళలకు అనుమానం వచ్చి బాలికకు వైద్యపరీక్షలు చేయించాక విషయం తెల్సి, గుండె గుభేల్ మంది వాళ్లకు. ఇంతకీ విషయమేమంటే, ఆ బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఇంత దారుణమా అంటూ బిక్కచచ్చిపోయారు అక్కడి వారంతా. బాలిక మామయ్య గోవింద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లి త్రివేణి ఉపాధి నిమిత్తం రెండెళ్ల క్రితం గల్ఫ్‌ వెళ్లింది. కన్న కూతురు మీద అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. కలియుగంలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని గొణుక్కుంటూ, సహజంగానే అందరూ ముక్కున వేలేసుకున్నారు.

English summary

A man raped his 17 year old daughter in ambajipeta,east godavari dirstrict in Andhrapradesh.Neighbours had complained to police on this incident.Police arrested him and taken him into their custody