కొడుకు ఫీజు(500) కట్టడం కోసం ఓ పేద తండ్రి సాహసం!

Father takes risk to pay his son school fees

12:37 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Father takes risk to pay his son school fees

తమ కడుపు మాడ్చుకునైనా సరే, తమ పిల్లల కోసం శ్రమిస్తుంటారు తల్లిదండ్రులు... అప్పో సప్పో చేసి చదివిస్తారు... ఈవన్నీ సహజం... కానీ కొడుకు చదువుకోసం అది కూడా కేవలం 500 రూపాయలు కోసం ఓ తండ్రి చేయరాని సాహసం చేసాడు. తినడానికి తిండి కూడా లేకపోయినా ఈ సాహసానికి దిగాడు, ప్రాణాలకు తెగించాడు. వివరాల్లోకి వెళ్తే, ముంబైలో కేటరింగ్ విభాగంలో రోజువారీ కూలిగా పనిచేసే నేపాల్ కి చెందిన దబెశ్ రోజూ 400 రూపాయలు మాత్రమే సంపాదిస్తాడు. అయితే ఖనాల్ వారం రోజులుగా పనులు దొరక్క, తినడానికి తిండిలేక, స్వచ్ఛంద సంస్థలు పెట్టే భోజనం తింటూ కడుపు నింపుకుంటున్నాడు.

అయితే తన కొడుకు సాగర్ తపా చదువుకోసం 500 రూపాయలు అవసరమయ్యాయి. స్నేహితుడుని అప్పు అడిగాడు. అయితే అతను ఈత పందెం వేసాడు. దీంతో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా 41 ఏళ్ళ ఖనాల్ ఓ పందెం కి దిగాడు. అదేమంటే, సబర్మతి నదిలో ఈత కొట్టే పందెం అది. నదిలో దూకేసిన అతడు కొంత దూరం ఈదాక, మునిగిపోతుండడంతో రక్షించండి అంటూ బిగ్గరగా కేకలు పెట్టాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ప్రాణాలు కాపాడారు. తన దయనీయ పరిస్థితిని వివరించాడు. డబ్బుల్లేక బిఎస్సీ చదువు మధ్యలో ఆపేసి, కూలి పనులకు పరిమితమైన ఖనాల్ తన కొడుకు బాగా చదువుకోవాలని కలలు కంటున్నాడు.. అందుకే ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ సాహసం చేసాడు.

English summary

Father takes risk to pay his son school fees. A father in Mumbai jumps into river and bet to swim in that river to pay 500 fees to his son.