బావిలో పడలేదు... పడేసాడు

Father Throws His Daughter In Borewell

11:58 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Father Throws His Daughter In Borewell

తెలంగాణాలో చాలా చోట్ల బోరు బావులు ఉండడం వలన ప్రమాదవశాత్తూ చిన్నారులు బోరు బావిలో పడిపోవడం , ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే వున్నాం. కానీ ఓ ప్రబుద్ధుడు తన రెండేళ్ళ కూతురినే బావిలో పడేసిన వైనం ఇది. రెండేళ్ల చిన్నారిని కన్నతండ్రే బావిలో పడేయడంతో ఆ చిన్నారి చనిపోయింది. కన్న తండ్రే దారుణంగా చిన్నారిని చంపిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలం కుషనపల్లిలో చోటుచేసుకుంది. పాప కనిపించడం లేదని ఇంటి సమీపంలో గాలించిన కుటుంబసభ్యులు చివరకు బావిలో మృతదేహాన్ని గుర్తించి, భోరు మన్నారు. భార్య అదనపు కట్నం తేలేదన్న కోపంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బంధువుల ఆరోపణ. పాప మృతి గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

English summary

A Father Throws His Daughter In Borewell.This worst incident was taken place in Kushanapalli,Nannela Mqandalam in Adilabad District.He has thrown his smaall daughter because of his wife did not bring exrtra dowry