మరోసారి జతకలిసే

Fawad Khan And Sonam Kapoor Milk Packet Add

12:22 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Fawad Khan And Sonam Kapoor Milk Packet Add

గతంలో ‘ఖూబ్‌సూరత్‌’ చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌, పాకిస్థానీ నటుడు ఫవాద్‌ఖాన్‌ల జోడీ మరోసారి తెరపై కనువిందు చేస్తోంది. అయితే..ఈ సారి మాత్రం సినిమా కోసం కాకుండా, ఓ పాకిస్థానీ ప్రకటన కోసం వీరిద్దరూ కలిసి నటించారు. ప్రముఖ తరంగ్‌ కంపెనీకి చెందిన పాల ప్యాకెట్‌ ప్రకటనలో ఫవాద్‌ రాకుమారుడిలా.. సోనమ్‌ సిండ్రెల్లాగా ఆకట్టుకుంటున్నారు. కెమిస్ట్రీ అద్భుతంగా పండటంతో.. ఈ ప్రకటనకు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఫవాద్‌ నటించిన ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ చిత్రం మార్చిలో విడుదల కానుంది.

English summary

Bollywood Glamorous Queen Sonam Kapoor and Pakistan actor Fawad Khan were previously acted in Khoobsurat movie.Now they together acted again for Pakistani add made him sell milk in Cinderalla’s world.