నిద్రలో హఠాత్తుగా మిమ్మల్ని కుదిపినట్టు అనిపించిందా? దానికి కారణాలు ఇవే..

Feeling sudden jerk while sleeping

03:24 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Feeling sudden jerk while sleeping

ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖం ఎరుగదు అని అంటారు కానీ, కొందరికి ఎలా నిద్రపోతే ఆలా మెలుకువ వస్తుంది. మరికొందరికి అసలు మెలుకువ రాదు. ఇక కొందరైతే నిద్రలోకి జారుకుంటున్నపుడు సడన్ గా ఒక కుదుపు నిద్రలోంచి మేల్కొల్పుతుందని అంటారు. ఆ కుదుపుకి మీ గుండె కూడా వేగంగా కొట్టుకుంటుందా? సాధారణంగా ఇలాంటివి మనం పడుతున్నాం అన్న భ్రమతోనో లేక ఏదైనా ఎత్తు ప్రదేశం నుండి కాలు జారి కింద పడుతున్నట్టు కల కంటున్నప్పుడో జరుగుతాయి. వీటిని హైప్నిక్ జెర్క్స్ అంటారు. ఇవి సాధారణంగా 70% మందికి ఉంటుందని అంటున్నారు.

1/6 Pages

సాధారణంగా ఈ కుదుపులు మనం సగం నిద్రలో సగం మేల్కొనపుడు, అంటే నిద్రలోకి మెల్లిగా జారుకుంటున్నపుడు వస్తాయట. దీని హైప్నగోజిక్ స్టేజ్ అంటారు. ఈ సమయంలో మనం ఏదో ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటూ ఉంటే, ఆ ఆలోచనలోనుండి ఏవో అర్ధం కానీ కలలు సృష్టింపబడుతున్న సమయంలో ఇలా జరుగుతుంది.

English summary

Feeling sudden jerk while sleeping