షుగర్ వ్యాధిని దూరం చేసే మెంతులు

Fenugreek for diabetes

12:22 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Fenugreek for diabetes

డయాబెటీస్‌ కోసం ఒక అద్బుతమైన నివారణ మార్గం మెంతులు. శతాబ్ధాలుగా మెంతులని ఆయుర్వేద వైద్యులు సిఫార్స్ చేస్తున్నారు. ఇవి మధుమేహాన్ని తగ్గించడంలో సమర్దవంతంగా పనిచేస్తాయి. మెంతులు బోజనం తరువాత రక్తంలోని చక్కెర స్థాయిని గమనించి, చక్కెర స్థాయి లో వచ్చే మార్పులను నివారించడంలో సహాయపడుతుంది. గ్లూకోజ్‌ స్థాయిని మెరుగుపరుస్తుంది. రోజూ మెంతులు ఆహారంలో తీసుకోవడం వలన ఇది చక్కెర స్థాయిని కంట్రోల్‌ చేస్తుంది. సాధారణంగా డయాబెటీస్‌ వలన హృదయ సంబంధ వ్యాదులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మెంతులు కొలస్ట్రాల్‌ స్థాయిని తగ్గించి దాని ద్వారా హృదయ సంబంధమైన రోగాల బారి నుండి కాపాడుతుంది.

1. మెంతులు నానపెట్టు విధానం

మెంతులను నీటిలో నానపెట్టి ఆ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగడం వలన రక్తంలోని చక్కెర స్థాయిని కంట్రోల్‌ చేస్తుంది.

కావలసినవి:

 • మెంతులు -10 నుండి 15 గ్రాముల
 • నీళ్ళు

తయారుచేయు విధానం:

 • ఒకపాన్‌లో నీరు పోసి వేడిచేయాలి.
 • ఒక గ్లాసుతో మెంతులు తీసుకొని అందులో వేడి చేసిన నీటిని వేయాలి.
 • ఆ గ్లాసు మీద మూతపెట్టి రాత్రంతా నాననివ్వాలి.
 • మరుసటి రోజు ఉదయానికి మెంతులు మెత్తగా మారతాయి. వాటిని తీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకుని మళ్ళీ నానపెట్టిన నీటి లో ఆ పేస్ట్‌ని కలుపుకుని తాగాలి.

2. మెంతుల టీ

రోజుకి ఒకటి లేదా రెండు సార్లు మెంతులు టీ ని తాగడం వలన షుగర్‌ లెవెల్స్ ని కంట్రోల్‌ చేయవచ్చు.

కావలసినవి:

 • మెంతులు -1 టీస్పూన్‌
 • ఎండిన మెంతి ఆకులు -3 టేబుల్‌ స్పూన్‌
 • మంచి నీళ్ళు -1 కప్పు

తయారుచేయు విధానం:

 • మెంతులను మెత్తగా పిండి చేయాలి.
 • మెంతు పిండి, ఎండిన మెంతి ఆకులు ఒక పాన్‌లో వేసి అవి మునిగే వరకు నీటిని పోసి మరగనివ్వాలి.
 • పాన్ మీద మూతపెట్టి 20 నుండి 30 నిమిషాల పాటు ఆ నీటిని మరగనివ్వాలి.
 • 30 నిమిషాల అనంతరం ఆ మిశ్రమాన్ని బాగా కలిపి టీ లాగా తాగాలి.
 • రోజు మెంతి టీ తాగడం చాలా మంచిది. ఇలా చేయడం వలన షుగర్‌ని కంట్రోల్‌ చేసుకోవచ్చు.

3. మెంతులు, పెరుగు

మెంతులు రుచి, వాసన పరంగా అంత బాగుండవు. కాని ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని పెరుగులో కలిపి తినడం వలన వాటి రుచిని, వాసనని దూరంచేస్తుంది.

కావలసినవి:

 • మెంతులు -10 గ్రాములు.
 • పెరుగు -1 కప్పు.

తయారుచేయు విధానం:

 • 10 గ్రాముల మెంతులు తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి.
 • మెత్తగా చేసుకున్న మెంతుల పేస్ట్‌లో ఒక కప్పు పెరుగు కలిపి తినాలి.
 • ఇలా రోజుకి ఒకటి లేదా రెండు సార్లు తినడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

English summary

Fenugreek for diabetes. Fenugreek seeds are a wonderful natural remedy for diabetes. The effectiveness of fenugreek seeds in diabetes management is also supported by scientific studies.