పవర్ స్టార్ అభిమానుల కు పండగే పండగ

Festival for Power Star Pawan Kalyan fans

12:51 PM ON 6th April, 2016 By Mirchi Vilas

Festival for Power Star Pawan Kalyan fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అభిమానులకు పండగ... అందునా పండగ పూటా సినిమా వస్తే ఇక ఫుల్ జోష్... ఏప్రియల్ 8న ఉగాది పండుగ.. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' రిలీజ్ అవుతున్న నేపధ్యంలో పవన్ అభిమానులు పండగ వాతావరణం తెచ్చేసారు. ఒక్కో ఏరియాలో ఒకో రకంగా పవన్ అభిమానులు సందడి చేస్తుంటే, తూర్పు గోదావరి జిల్లాలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వినూత్నంగా ఓ పోస్టర్ రూపొందించారు. సర్దార్ రిలీజ్ అలాగే ఉగాది సందర్భంగా పవన్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు శుభాకాంక్షలు అంటూ రూపొందించిన పోస్టర్ ని ఆవిష్కరించి పండగ కళ ముందే తెచ్చారు. ఇక సినిమా రిలీజ్ రోజున ఎక్కడెక్కడ ఇంకెంత హడావిడి చేస్తారో చూడాలి.

English summary

Festival for Power Star Pawan Kalyan fans. Sardar Gabbar Singh movie release is the feastival for Pawan Kalyan fans.