ట్రైలర్ లోనూ మసాలా దట్టింపు(వీడియో)

Fever hindi movie trailer

01:05 PM ON 15th June, 2016 By Mirchi Vilas

Fever hindi movie trailer

సినిమా ఎలావున్నా ట్రైలర్ ని చూసి వచ్చేస్తారనో ఏమో గానీ, ఈ మధ్య ట్రైలర్ లోనే మసాలా దట్టించేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫీవర్ సంబంధించి దాదాపు 3 నిమిషాల నిడివిగల ట్రైలర్ ని యూనిట్ రిలీజ్ చేసింది. సినిమా మాదిరిగా ట్రైలర్ లోనూ లిప్ లాక్ లు ఎక్కువగా వుండడంతో అసహనం చేస్తున్నవాళ్లు లేకపోలేదు. ట్రైలర్ ఎంతగా ఆకట్టుకుంటే అంతగా హిట్ అవుతుందని ప్రస్తుతం నమ్ముతున్నారు. ఇలా ట్రైలర్ లోని బరితెగింపు సీన్స్ చూసినవాళ్లు మాత్రం, సినిమాకి ట్రైలర్ కీ తేడా లేకుండా పోతోందని అంటున్నారు.

రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఫిల్మ్ ఇది. ఈ వీడియోకి సినీ లవర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. రాజీవ్ ఝవేరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో లొకేషన్స్, ఇన్సిడెంట్స్ సూపర్బ్ అని అంటున్నారు. ఇందులోనూ చాలావరకు నటీనటులు కొత్తవారే. వచ్చేనెల 22న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన.

English summary

Fever hindi movie trailer