పశ్చిమ్‌బంగలో 5వ విడత  పోలింగ్‌

Fifth Phase Of West Bengal Elections

03:17 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Fifth Phase Of West Bengal Elections

పశ్చిమ్‌బంగ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం ఐదోవిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు భారీగా బారులు తీరారు. సీఎం మమతా బెనర్జీ సహా పలువురు ప్రముఖ నేతలు బరిలో ఉన్న కీలకమైన 53 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది. కోల్‌కతాలోని భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి మమతాబెనర్జీ పోటీ చేస్తున్నారు. మమతకు పోటీగా లెఫ్ట్‌ -కాంగ్రెస్‌ నుంచి దీపా దశమున్షి, భాజపా నుంచి నేతాజీ మనవడు చంద్రకుమార్‌ బోస్‌ బరిలో ఉన్నారు. కోల్‌కతా సౌత్‌, సౌత్‌ 24 పరగణాస్‌, హుగ్లీ జిల్లాలోని 53 నియోజకవర్గాల్లో 43 మంది మహిళలు సహా 349 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: చిరంజీవి వల్లే కాలేదు, ఇతని వల్ల అవుతుందా?

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే పోలింగ్‌ లో సుమారు 1.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 53 నియోజకవర్గాల్లో 14,500 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక స్టింగ్‌ ఆపరేషన్‌లో చిక్కిన మంత్రి సుబ్రతా ముఖర్జీ పోటీ చేస్తున్న నియోజవర్గం కూడా ఈ విడతలోనే వుండడం విశేషం. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత దీరెక్‌ ఓబ్రెయిన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇవి కూడా చదవండి: అన్నయ్య సినిమాకు రాని పవన్.. నితిన్ సినిమాకు వస్తున్నాడు

English summary

West Bengal Elections Were Going Calmly in West Bengal Today Fifth Phase of Polling was going today.