నువ్వా-నేనా అంటున్న ప్రకాష్ రాజ్-రావు రమేష్

Fight Between Prakash Raj And RaoRamesh

10:57 AM ON 29th July, 2016 By Mirchi Vilas

Fight Between Prakash Raj And RaoRamesh

నటుడు ప్రకాష్ రాజ్ పేరు చెప్పగానే మనకు అసలైన నటుడు కనిపిస్తాడు. ఆవిధంగా చెప్పాలంటే, కోట శ్రీనివాసరావు తరువాత తెలుగులో వైవిధ్యమైన పాత్రలు చేసిన నటుడు ఇతనే. ఏ క్యారెక్టర్ అయినా అందులోకి పరకాయ ప్రవేశం చేయడం అతనికే చెల్లింది. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కి డిమాండ్ తగ్గుతోంది. దానికి కారణం రావు గోపాలరావు నట వారసుడిగా రావు రమేష్ టాలీవుడ్ లో అడుగు పెట్టడమే అంటున్నారు. ఇక రావు రమేష్ గొప్ప నటుడు అనే స్టేజీకి వచ్చేసాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ పోటాపోటీగా నటించిన సినిమా కూడా రాబోతోంది.

అదే.. 'శ్రీరస్తు శుభమస్తు' ఇద్దరు గొప్ప నటులు, ఇద్దరికీ సమాన స్థాయి పాత్రలు. ఒకరికొకరు ఎదురుపడిన సన్నివేశాల్లో, ఎమోషనల్ సీన్లలో నువ్వా-నేనా అన్నట్లు నటించారని దర్శకుడు పరశురామ్ అంటున్నాడు. ఆగష్టు 5న విడుదల కానున్న ఈ చిత్రం యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించేలా తెరకెక్కించినట్టు చెప్పాడు.

ఇది కూడా చూడండి: దెయ్యాల గురించి ఈ వివరాలు చెప్పి మరీ చచ్చిపోయాడు!

ఇది కూడా చూడండి: కలాం హెయిర్ స్టైల్ తో పాటు మీకు తెలియని నిజాలు!

ఇది కూడా చూడండి: తలుపులున్న వైపు కాళ్ళు పెట్టి పడుకుంటే ఏమౌతుందో తెలుసా?

English summary

Fight Between Prakash Raj And Rao Ramesh.