స్టేజి పై అల్లు అర్జున్ పరువు తీసిన ఫైట్ మాస్టర్స్

Fight masters Ram Lakshman speaks about Allu Arjun on stage

10:06 AM ON 29th April, 2016 By Mirchi Vilas

Fight masters Ram Lakshman speaks about Allu Arjun on stage

ఆ మధ్య హాట్ యాంకర్ అనసూయ అల్లు అర్జున్ గురించి మనసులో అనుకున్నట్లు యధాలాపంగా అన్న మాటలు ఎంత పెద్ద వివాదం రేపాయో తెలిసిందే. ‘గంగోత్రి’ సినిమా చూసి.. ఇతను హీరో ఏంటి? ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉంటే మాత్రం ఇలాంటోణ్ని హీరోని చేసేస్తారా? అని అనుకున్నానని.. కానీ తర్వాత అల్లు అర్జున్ తనను తాను మౌల్డ్ చేసుకున్న విధానం చూసి అభిమాని అయిపోయానని అంది అనసూయ. నిజానికి ఇందులో తప్పుబట్టాల్సిందేమీ లేదు. కానీ అభిమానులు మాత్రం ఆమె మాటల్ని మరో రకంగా తీసుకున్నారు. అనసూయను ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

ఇది కూడా చదవండి: క్షుద్ర పూజలు చేస్తూ దొరికేసిన హీరోయిన్

హీరోల గురించి మాట్లాడేటప్పుడు అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో అంత జాగ్రత్తగా మాట్లాడాలని అనసూయకు ఆ రోజు బాగానే అర్ధమయింది. అయితే బన్నీ అక్కడ లేనప్పుడు అనసూయ అలా మాట్లాడితే.. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ లలో ఒకరు బన్నీ ముందే ఇదే తరహాలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. ‘సరైనోడు’ సక్సెస్ మీట్ లో రామ్ మాట్లాడుతూ.. ‘గంగోత్రి సినిమా చూసి బన్నీ హీరోగా పనికిరాడు అంటూ ఇండస్ట్రీలో చాలా మంది కామెంట్ చేశారు. కానీ బన్నీ ఆ కామెంట్లను లెక్క చేయకుండా పనినే ప్రాణంగా భావించి.. సక్సెస్ సాధించి.. ప్రేక్షకుల గుండెల్లోకి బుల్లెట్ లాగా దూసుకెళ్లాడు’ అన్నాడు.

ఇది కూడా చదవండి: లోకేష్ పప్పు సుద్ద అంటూ విరుచుకు పడ్డ రోజా

అప్పుడు దాదాపుగా అనసూయ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె పై అభిమానులు పెద్ద ఎత్తున దాడి చేశారు. ఆ సంగతి తెలిసి కూడా రామ్ ఇలాంటి కామెంట్ చేయడం ఆశ్చర్యం కలిగించేదే. కాకపోతే బన్నీ అక్కడే ఉండబట్టి.. ఆ వ్యాఖ్యల్ని స్పోర్టివ్ గా తీసుకోబట్టి సరిపోయింది కానీ.. మరో వేదికలో ఎక్కడైనా ఇలా మాట్లాడి ఉంటే రామ్-లక్ష్మణ్ సోదరులకు బ్యాండ్ పడేదే.

English summary

Fight masters Ram Lakshman speaks about Allu Arjun on stage. Fight masters Ram Lakshman takes Allu Arjun Libel on stage.