ఫియో ఆండ్రాయిడ్ ఆడియో ప్లేయర్

Fiio X7 Android Audio Player

11:25 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Fiio X7 Android Audio Player

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఫియో భారత మార్కెట్ లోకి అడుగుపెట్టింది. తాజాగా ఫియో ఎక్స్7 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ఆధారిత హై రిజల్యూషన్ ఆడియో ప్లేయర్‌ను రిలీజ్ చేసింది. రూ.42,299 ధరకు ఈ డివైస్ వినియోగదారులకు లభిస్తోంది. ఇందులో ఆడియో ప్రాసెసింగ్ కోసం క్వాడ్‌కోర్ రాక్‌చిప్‌ను ఏర్పాటు చేసింది. దీంట్లో 4 ఇంచుల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఇది 480 X 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 1 జీబీ ర్యామ్ , 32 జీబీ ఇంటర్నల్ మెమోరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. FLAC, WAV, ALAC, MP3, OGG, DSD, DXD, PCM వంటి ఫైల్ ఫార్మాట్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో వైఫై, బ్లూటూత్ కూడా ఉంది.

English summary

Chineese Electronics Manufacturing Company Fio launched a new Android Audio Player in India named "Fio X7". The price of this Audio player was Rs. 42,299. This audio player comes with the features like 4-inch touch screen,3500mAh battery, 1GB RAM, and 32GB internal memory etc