సినీ నటుడ్ని బోల్తా కొట్టించారు ... లక్షలు దోచేశారు

Film actor cheated by someone

10:59 AM ON 8th June, 2016 By Mirchi Vilas

Film actor cheated by someone

వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు ... మోసం చేసి డబ్బులు దోచేయాలంటే మార్గా లెన్నో ... పైగా ఒక హోంగార్డు.. ఓ టీవీ ఛానెల్ డ్రైవర్.. ఓ వ్యభిచారిణి కలిసి ఓ సినీ నటుడికి మస్కా కొట్టి లక్షలు దోచేసిన ఘటన ఇది. సినీ ఫక్కీలో ఎలా డబ్బులు కొట్టేశారో తెలిస్తే షాకవుతారు.

తెలుగు సినిమాల్లో నటించే 48 ఏళ్ల కాలెపు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంటికి ఇటీవల ఐదుగురు యువకులు.. ఇద్దరు యువతులు వచ్చారు. అందులో కొందరు పోలీసులమని చెబితే.. కొందరు మీడియా ప్రతినిధులమని చెప్పారు. ఈ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందంటూ హడావుడి చేశారు. కెమెరా.. డమ్మీ పిస్టల్ చూపించి బెదిరించారు. ఇంటి బీరువాలో ఉన్న డబ్బు దొంగిలించారు. తర్వాత శ్రీనివాసరావును బలవంతంగా కారులో తీసుకెళ్లి ఏటీఎం కార్డు ద్వారా మరింత డబ్బు డ్రా చేయించారు. రూ. 2 లక్షలు ఇవ్వకుంటే నీ గురించి టీవీ ఛానెల్లో వేస్తామంటూ బెదిరించారు. ఎలాగోలా వీళ్ల బారి నుంచి తప్పించుకున్న శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు విచారణ జరిపి నిందితుల్ని అదుపులో తీసుకోగా ఒక్కొక్కరి భాగోతం బయటపడింది. వీరిలో సీఐడీ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న రాజు ఎస్ఐగా.. ఓ టీవీ ఛానెల్ డ్రై వరుగా పనిచేస్తున్న మధు కానిస్టేబుల్ లాగా.. ఓ వ్యభిచారిణి టీవీ ఛానెల్ విలేకరిగా బిల్డప్ ఇచ్చి ఈ వ్యవహారాన్ని రక్తి కట్టించినట్లు తేలింది. మొత్తంగా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ టీవీ ఛానెల్ యజమానే తమ పేరు చెప్పి ఇలాంటి దందాలు చేయమని.. తనకు కూడా వాటా ఇవ్వమని చెప్పడంతో తామిలా చేశామని నిందితులు చెప్పడం కొసమెరుపు ..

ఇది కూడా చూడండి: జూన్ నెలలో పుట్టిన వారి విశిష్ట లక్షణాలు

ఇది కూడా చూడండి:సినీ నటుడ్ని బోల్తా కొట్టించారు ... లక్షలు దోచేశారు

ఇది కూడా చూడండి: ఆడియో రిలీజ్ వుండదట...

English summary

Film actor cheated by someone.