అమీర్‌  పై పోలీసు కేసు...

Film Maker Files Police Complaint On Amir Khan

06:40 PM ON 24th November, 2015 By Mirchi Vilas

Film Maker Files Police Complaint On Amir Khan

దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ అమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యాల పై దేశంలో అనేక చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో అమీర్‌ వ్యాఖ్యాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ లోని షార్ట్‌ఫిల్మ్‌ ని చిత్ర నిర్మాల పిఆర్‌ ఉల్లాస్‌ ఢిల్లీ లోని న్యూ అశోక్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో అమీర్‌ పై ఫిర్యాదు చేసారు.

ఉల్లాస్‌ మాట్లాడుతూ దేశంలోని సామరస్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి ప్రధాన విధి అని అన్నారు. అమీర్‌ఖాన్‌ లాంటి ప్రముఖ వ్యక్తులు ఇలాంటి సున్నితమైన వ్యాఖ్యాలను చేసేముందు అసలు ఎక్కడ జరుగుతుందో ప్రస్తావించాలని ఆయన అన్నారు.

సెలబ్రెటీలు చేసే ఇలాంటి వ్యాఖ్యాల వల్ల దేశంలో శాంతి,శ్రేయస్సు నెలకోనదని అన్నారు. అసహనం,ఆందోళనలు పెరిగిపోతున్నాయని చెప్పి ప్రజలను భయాందోళనలకు గురిచేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది ఇలా ఉంటే అమీర్‌ వ్యాఖ్యాలను బిజేపి ఖండించింది. ఐతే కాంగ్రెస్‌ పార్టీ నేతలు ,ఢిల్లీ సిఎం అరవింద్‌ క్రేజివాల్‌ మాత్రం అమీర్‌ వ్యాఖ్యలను సమర్ధించారు.

English summary

Filmmaker PR Ullhas on Tuesday filed a police complaint against Aamir Khan for his remarks on "growing disquiet" in the country.