ప్రాచీన విగ్రహాల స్మగ్లింగ్ లో సినీనటికి లింకు?

Film star associated with the smuggling of ancient statues

12:48 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Film star associated with the smuggling of ancient statues

అన్ని రంగాల్లో మాదిరి సినీ రంగాన్ని కూడా అన్ని అవలక్షణాలు చుట్టుముట్టేస్తున్నాయి. అలాంటిదే ఈ ఘటన కూడా .. పురాతన విగ్రహాల అక్రమ తరలింపు కేసుల్లో ప్రముఖ సినీనటికి సంబంధం ఉన్నట్టు విగ్రహాల స్మగ్లింగ్ నిరోధక విభాగం పోలీసులు అనుమానిస్తున్నారు. టూరిస్టు వీసాతో ఆ నటి పలు విదేశాలకు వెళ్లి పురాతన విగ్రహాలను తరలించుకెళ్లి విక్రయించినట్టు చెబుతున్నారు. చెన్నై ఆళ్వార్‌పేటలోని ఓ నివాసగృహంలో విదేశాలకు తరలించేందుకుగాను దాచి ఉంచిన రూ.50 కోట్ల విలువైన ప్రాచీన విగ్రహాలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఆతర్వాత విచారణ సాగిస్తున్నప్పుడు, కొన్ని విషయాలు తెల్సి షాకింగ్ కి గురయ్యారట. ఈ విగ్రహాల స్మగ్లింగ్‌లో ప్రముఖ సినీనటి కీలకపాత్ర వహించారని చెబుతున్నారు. కొన్నేళ్లకు ముందు శ్రీపెరంబుదూరులోని మణికంఠేశ్వరాలయంలో శివపార్వతుల విగ్రహాలు, తిరువణ్ణామలై జిల్లా పయ్యూరు ప్రసన్న వెంకటేశపెరుమాళ్ ఆలయంలో మూడు పురాతన విగ్రహాలతో పాటు పలు ఆలయాల్లోని విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఈ చోరీలపై రాష్ట్ర ఆర్ధిక నేరాల విభాగం ఆధ్వర్యంలోని విగ్రహాల స్మగ్లింగ్ నిరోధక విభాగం అదనపు డీజీపీ ప్రదీప్ ఫిలిప్, ఐజీ పొనమాణికవేల్ నాయకత్వంలోని పోలీసులు తీవ్ర విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో చెన్నై నగరంలో ప్రాచీన విగ్రహాలను విదేశాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రహస్య సమాచారం అందటంతో, ఆళ్వార్‌పేట కస్తూరి రంగన వీధిలో నివసిస్తున్న దీనయాళన అనే వ్యక్తి చెందిన నివాసగృహంలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆ తనిఖీల్లో ఆ నివాసగృహంలోని పలు గదుల్లో దాచి ఉంచిన శివపార్వతులు, కుమారసామి, వినాయకుడు తదితర దేవతా విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో చాలా విగ్రహాలు అత్యంత ప్రాచీనమైనవని, వాటి విలువ కోట్లలో ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న విగ్రహాల విలువ రూ.50 కోట్ల దాకా ఉంటుందని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి కుమార్ (60), మానసింగ్ (55), రాజామణి (60) అనే ముగ్గురిని అరెస్టు చేసి, పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. పరారీలో ఉన్న దీనదయాళన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.

ఇదిలా ఉండగా విగ్రహాలు పట్టుబడిన ఇంటి యజమాని దీనదయాళన్ కు ఓ ప్రముఖ సినీ నటితో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ నటిని మోడల్‌గా చేసుకొని ఓ అందమైన విగ్రహాన్ని తయారు చేయడానికి దీనదయాళన్ ప్రయత్నించాడని తెలుస్తోంది. ఆ నటి ఆసే్ట్రలియా, జర్మనీ, అమెరికా తదితర దేశాలకు షూటింగ్ నిమిత్తం వెళ్లివస్తుండేదని, ఆ సాకుతోనే ఆమె పురాతన విగ్రహాలను విదేశాలకు తరలించి విక్రయించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనదయాళన చెన్నై నుంచి గత కొంతకాలంగా ఓడల ద్వారా విగ్రహాలను విదేశాలకు తరలించాడని తెలిసింది. అరెస్టయిన ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు పోలీసు అధికారులు సమాయత్తమవుతున్నారు. తద్వారా ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్ళను పట్టుకోవాలని భావిస్తున్నారు. ఇక ఈకేసులో వుందని భావిస్తున్న ఆ నటి ఎవారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చూడండి:సచిన్ ఫుట్‌బాల్ జట్టులో మెగాస్టార్ - నాగ్

ఇది కూడా చూడండి:మహిళలే ఎక్కువగా బూతు పదాలు వాడతారా?

ఇది కూడా చూడండి:ప్రముఖ హాస్య నటుడు రజాక్ ఇకలేడు

English summary

Film star associated with the smuggling of ancient statues