బాలయ్య నిర్మాతపై చెక్ బౌన్స్ కేసు

Financiers faced the problems with tollywood producer

11:49 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Financiers faced the problems with tollywood producer

బాలకృష్ణ హీరోగా 'శ్రీరామరాజ్యం' సినిమా తీసిన ప్రముఖ టాలీవుడ్ నిర్మాత యలమంచిలి సాయిబాబు తన కొడుకు హీరోగా 'ఇంటింట అన్నమయ్య' సినిమా తీసారు. ఈ సినిమాకి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు డైరెక్టర్ గా వ్యవహరించారు. అయితే, ఈ మూవీకి సంబంధించి చేసిన అప్పులు ఇప్పటివరకూ తీర్చలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇచ్చిన చెక్కులన్నీ బౌన్స్ అవడంతో కొంతమంది ఫైనాన్సియర్స్ నిర్మాత సాయిబాబు మీద కోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు.

అయితే, ఈ సినిమా రిలీజ్ అవకుండానే కొడుకుతో మరో సినిమా చేసేందుకు సాయిబాబు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే గుంటూరు టాకీస్ బ్యానర్లో యలమంచిలి సాయిబాబు సన్ హీరోగా 'రాజా నువ్వు కేక' అనే సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇది కూడా చూడండి: వేడిచేయకూడని ఆహార పదార్ధాలు

ఇది కూడా చూడండి: హీరోలకు మళ్ళి లైఫ్ ఇచ్చిన సినిమాలు

ఇది కూడా చూడండి: తెలుగు హీరోలు అప్పుడు - ఇప్పుడు

English summary

Some Financiers faced the problems with tollywood producer yalamanchili saibabu,