ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్మార్ట్ ఫోన్ రూ. 4 వేలే

Finger Print Sensor SmartPhone For Just 4000

05:36 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Finger Print Sensor SmartPhone For Just 4000

చైనాకు చెందిన బ్లుబూ సంస్థ అతి తక్కువ ధరకే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. బ్లుబూ ఎక్స్‌ఫైర్ 2 పేరిట ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. సింగిల్ సిమ్ వేరియంట్ ధర 59.9 అమెరికన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 4 వేలు. ఇక డ్యుయల్ సిమ్ వేరియంట్ ఫోన్ ధర 74 డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 5 వేలు. ప్రస్తుతం ఒక అంతర్జాతీయ ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ వెబ్ సైట్లో ఈ స్మార్ట్‌ఫోన్ లిస్ట్ చేసింది. ఫిబ్రవరి 5 నుంచి ఈ ఫోన్ల షిపింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ రోజ్ గోల్డ్, బ్లాక్, వైట్, గోల్డ్ కలర్స్ లో లభిస్తోంది.

ఎక్స్‌ఫైర్ 2 ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, 3జీ, 2150 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary

Chineese Mobile company Bluboo launches a new cheap smartphone XFire 2 with finger print sensor.This was the cheapest phone till now with finger print sensor.The price of this smartphone was just 4000 and it comes with the features like 5" IPS LCD,1 GB RAM,Rear - 8 MP,Front - 5 MP,Internal - 8 GB,External - Expandable upto 32 GB