మీ వేలిముద్రతో మీ క్యారక్టర్ తెలుసుకోండి

Fingerprints Psychology

11:56 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Fingerprints Psychology

మీ చేతి వేలిముద్రలను బట్టి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని 1900 ప్రాంతంలో డా. హారొల్డ్ కుమిన్స్ అనే చర్మ వైద్యనిపుణుడు తెలిపారు. వయస్సు పెరిగేకొద్దీ మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి కానీ వేలి ముద్రలు మాత్రం మారవు. చిన్న వయస్సులోనే పిల్లల వేలిముద్రల ద్వారా, ప్దెయ్యాక వారి శక్తి సామర్ధ్యాలు అంచనావేసి తల్లిదండ్రులు ముందుగానే ఆచరణలో పెట్టవచ్చని కుమిన్స్‌ తెలిపారు. ముందుగా మీ రెండు చేతి ముద్రలను బాగా గమనించండి. అందులో కుడి చేతి వేలిముద్రల ద్వారా మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చంట. మీ చేతి వేలిముద్రలు ఈ కింది నమూనాలో ఏ నమూనాకి సరి తూగుతున్నాయో చూసి మీ వ్యక్తిత్వాన్ని చెక్‌ చేసుకోండి.

1/11 Pages

1. సాధారణ నమూనా

సాధారణ నమూనా కలిగిన వారి వేలిముద్ర ఆకారం వంపులుగా, కొండలుగా తిరిగి ఉంటాయి. ఇటువంటి గీతలు కలిగిన వారు కష్టపడడం మరియు ఎదుటివారి నుండి కొత్త విషయాలను నేర్చుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు భవిష్యత్‌ గురించి చక్కగా ఆలోచించి ఒక ప్రణాళిక వేసుకుంటారు. వీరు వారి కుటుంబం కోసం ఏది చేయడానికైనా సిద్ధపడతారు. ఎదుటివారితో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తారు. ఎటువంటి పరిస్థితులలో అయినా, రిస్క్‌ ఎదురైనా వీరు భయపడరు. డ్రామాలాడేవాళ్ళంటే వీరికి మహా చిరాకు. ఎక్కడ తగ్గాలో వీరికి బాగా తెలుసంట.

English summary

In this article we have listed about psychology based on finger prints. Using fingerprints to identify indi­viduals has become an invaluable tool worldwide. Here some points says your psychology check it out.